Wednesday, September 15, 2010

కార్కును చేసేదెలా? , How did cork make?



ప్రశ్న: కార్కును ఎలా తయారు చేస్తారు? దాని వల్ల ఉపయోగాలేంటి?

-కె. జయప్రకాష్‌రెడ్డి, ప్రొద్దుటూరు

జవాబు: కార్క్‌ (cork) అనేది ఓక్‌ చెట్టు బెరడు. ఈ చెట్లు స్పెయిన్‌, పోర్చుగల్‌లో ఎక్కువగా ఉంటాయి. మనదేశం, పశ్చిమ అమెరికాలో కూడా కొద్దిగా ఉంటాయి. ఆరు నుంచి పన్నెండు మీటర్ల ఎత్తు పెరిగే ఈ చెట్ల కాండం మందం ఒక మీటరు వరకూ ఉంటుంది. మెరిసే ఆకుపచ్చ రంగులో ఉండే ఈ చెట్టుకు 20 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మొదటి సారిగా దాని బెరడును వలుస్తారు. ఇందువల్ల చెట్టుకు ఏ హానీ జరగదు. ఈ బెరడు లోపలి వైపు భాగం నుంచే కార్క్‌ను తయారు చేస్తారు. సుమారు వందేళ్లు బతికే ఈ చెట్ల నుంచి ప్రతి తొమ్మిదేళ్లకోసారి బెరడు వలుస్తారు. కార్క్‌ను సీసాల బిరడాలు చేయడానికి, నీటిలో ఈదేవారికి లైఫ్‌ సేవర్ల తయారీకి ఉపయోగిస్తారు. అలాగే కార్క్‌ను పొడి చేసి దాన్ని జిగురుతో కలిపి పైపుల్లోని రంధ్రాలు పూడ్చడానికి, ఆటోమొబైల్‌ గాస్కెట్ల తయారీకి, సినిమా, టీవీ స్టూడియోలలోని విశాలమైన గదులను సౌండ్‌ప్రూఫ్‌గా చేయడానికి, ఫ్రీజర్‌ గదుల్లో, రెఫ్రిజిరేటర్లలో, గిడ్డంగుల్లో ఇన్సులేషన్‌ మెటీరియల్‌గా కూడా వాడతారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...