-ఎం.మురళీధర్, కాకినాడ, తూ||గొ జిల్లా
జవాబు: చాలా కీటక(insect) జాతి జంతువుల్లో జీవిత చక్రం (life cycle)ఉంటుంది. కొన్ని దశల్లో వాటి రూపాల్ని మార్చుకుంటూ ఎగురుతాయి. సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. ఇలా దేహ రూపాల్ని మార్చుకునే విధానాన్ని మెటామార్ఫసిస్ (metamorphosis) అంటారు. ఒక్కో కీటకం తొలిదశ రూపం (డింభకం) ఒక్కో విధంగా ఉంటుంది. అది క్రమేపీ కోశస్థ (ప్యూపా) దశగా మారి ఆ తర్వాత ప్రౌఢ (adult) జీవిగా మారుతుంది. ఇక సీతాకోక చిలుక రెక్కలపై ఎలాంటి రంగులుంటాయనే విషయం ఆయా జీవుల జన్యు నిర్మాణం(genetic code)పై ఆధారపడి ఉంటుంది.
-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్, రాష్ట్రకమిటి, జనవిజ్ఞానవేదిక
- =================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...