ప్రశ్న: నదిలో ఇసుకనే కట్టడాల్లో ఎందకు వాడతారు? పొలాల్లో, చెరువుల్లో దొరికే ఇసుక పనికిరాదా?
జవాబు: పొలాల్లో, చెరువుల్లో దొరికే ఇసుక రేణువుల మధ్య తేలికయిన దుమ్ము, ధూళి, మట్టి, నారపీచుల వంటి మలినాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇలాంటి ఇసుక రంగు నల్లగా లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. సిమెంటును, ఇసుకను కలిపినపుడు నిర్మాణాలు స్థిరంగా, దృఢంగా ఉండాలంటే గట్టిగా ఉన్న స్వచ్ఛమైన ఇసుక రేణువులే కావాలి. అప్పుడే అది సిమెంటు, కంకర, ఇనుప ముక్కల్ని నిరాఘాటంగా, సానుదీర్ఘం(continuous)గా అంటి పెట్టుకుని ఉండగలదు. ఇసుకలోని మలినాలు సిమెంటుతో బంధాలు ఏర్పరుచుకోవు కాబట్టి రేణువుకు, రేణువుకు మధ్య సంధానం కరవై నిర్మాణంలో అస్థిరత్వం (distability) ఏర్పడుతుంది. నదుల్లోని ఇసుక రేణువుల మధ్య ఉండే మలినాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడం వల్ల అక్కడి ఇసుక శుద్ధమైనదిగా తయారవుతుంది. ఎక్కువ గట్టిగా ఉండే ఇసుక రేణువులే తీరాల్లోను, నదీగర్భంలోను పోగుపడతాయి. అందుకే నదులు, సముద్రతీరాలకు కొంచెం దూరంలో దొరికే ఇసుకను నాణ్యమైనదిగా పరిగణిస్తారు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్,-వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...