జవాబు: ఇనుప వస్తువులకు వాతావరణంలోని తేమ, ఆక్సిజన్ తగిలినప్పుడు రసాయనిక చర్య జరిగి ఐరన్ ఆక్సైడు పొర ఏర్పడుతుంది. ఈ పొరనే 'తుప్పు' అంటారు. స్టెయిన్‌లెస్ స్టీలులో కూడా ఇనుము ఉన్నప్పటికీ, దాంతో పాటు కలిసి ఉండే ఇతర పదార్థాలపై పరిసరాల ప్రభావం ఉండదు. స్టీలులో ఇనుము, క్రోమియం మాంగనీస్, సిలికాన్, నికెల్, కార్బన్ మూలకాలు ఎక్కువ పాళ్లలో ఉంటాయి. ఈ మూలకాలకు తేమ, ఆక్సిజన్ తగిలితే లోహ ఆక్సైడ్లు, హైడ్రాక్సైడ్‌లతో కూడిన సన్నని స్థిరమైన పొర ఏర్పడుతుంది. పరిసరాల ప్రభావం స్టెయిన్‌లెస్ స్టీలులోని ఇనుముపై పడకుండా ఈ పొర అడ్డుకుంటుంది.ఈ పొర మందం అత్యంత సూక్ష్మంగా (10-8 సెంటీమీటర్లు) ఉండడంతో మన కంటికి కనబడదు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...