ప్రశ్న: సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మనకు దూరంగా ఉన్నా పెద్దగా కనిపిస్తాడు. అదే సూర్యుడు మధ్యాహ్నం వేళ దగ్గరగా వచ్చినప్పుడు చిన్నగా కనిపిస్తాడు. ఎందుకని?
జవాబు: నిజానికి సూర్యుడు ఉదయం, మధ్యాహ్నం మనకు ఒకే దూరంలో ఉంటాడు. కానీ ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్యకిరణాలు ఏటవాలుగా భూమిపై పడతాయి. అందువల్ల ఆ కిరణాలు వాతావరణంలో బాగా మందంగా ఉన్న గాలిపొరల్లో ఎక్కువ దూరం పయనించాల్సి వస్తుంది. శూన్యం నుంచి గాలి పొరల్లోకి ప్రవేశించిన సూర్యకిరణాలు వంగుతాయి. ఈ ప్రక్రియను వక్రీభవనం (refraction) అంటారు. దీని ప్రభావం వల్లే సూర్యుడు ఉదయం, సాయంత్రం పెద్దగా కనిపిస్తాడు. అదే మధ్యాహ్నం వేళ నడినెత్తిన ఉన్న సూర్యకిరణాలు తక్కువ మందం ఉండే గాలి పొరల్లో పయనించడం వల్ల వక్రీభవన ప్రభావం అంతగా ఉండదు. అందువల్ల ఆ సమయంలో సూర్యుడు చిన్నగా కనిపిస్తాడు.
courtesy with-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...