ప్రశ్న: వేసవిలో ఎండిన నేలపై ఉన్నట్టుండి వర్షం కురిస్తే ఒక విధమైన సువాసన వ్యాపిస్తుంది. ఎందువల్ల?
జవాబు: వేసవి ఎండలకు నేల ఎండిపోయినప్పుడు నేలలో నుండి పొడిగా ఉండే దుమ్ము పైకి వస్తుంది. దానితో పాటు ఒక రకమైన సూక్ష్మజీవులు (బ్యాక్టీరియా) కూడా నేల ఉపరితలంపై పరుచుకుంటాయి. ఈ బ్యాక్టీరియా తడిగా, నులివెచ్చగా ఉండే నేలలో పెరుగుతాయి. దుమ్ము, బ్యాక్టీరియా కూడుకున్న ఎండిన నేలపై వర్షం పడినప్పుడు అవి వర్షం నీటితో కలుస్తాయి. అప్పుడు ఏర్పడిన తుంపరల నుంచి వచ్చే గాలిని మనం పీల్చడంతో ఒక ఆహ్లాదకరమైన వాసన వస్తుంది. ఈ వాసన రావడానికి ఏక్టినోనైసిటేల్స్ (actinonycetales) జాతికి సంబంధించిన సిరప్టోమైసిస్ (syreptomycis) అనే బ్యాక్టీరియానే కారణం.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్
- ==================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...