ప్రశ్న:కథలు, సినిమాల్లో గ్రహాంతర వాసుల గురించి చెబుతుంటారు. అనేక మంది నమ్ముతారు కూడా. వాళ్లు నిజంగా ఉన్నారా?
జవాబు: గ్రహాంతర వాసులు ఉన్నారో లేదో చెప్పడానికి నేటి విజ్ఞాన శాస్త్రం వద్ద కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ భూమి మీద ఉన్న పరిస్థితులు, పరిణామం (evelution) మరెక్కడైనా సంభవించి ఉంటే ఆ గ్రహాల మీద కూడా జీవం ఆవిర్భావానికి అవకాశం లేకపోలేదు. ఆ జీవులు క్రమేణా పరిణామం చెంది ఉన్నత స్థాయి జీవులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. మన సౌరమండలంలో మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు లేవు. భూమికి సమీపంలో ఉన్న మార్స్ (కుజ లేదా అంగారక) గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోడానికి ఇటీవల పంపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడికి చేరుకోడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. సుమారు 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుజ గ్రహం మీదకు వెళ్లడానికే ఇంతకాలం పడితే ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడెక్కడో ఉండే సౌరమండలాలలోని గ్రహాల మీది పరిస్థితులు ఎలాంటివో తెలియడానికి ఎన్నో వందల ఏళ్లు పడుతుంది. ఆయా గ్రహాల మీద గ్రహాంతర వాసులెవరైనా ఉన్నా వాళ్లు భూమి దగ్గరకి రావడానికి కూడా అంతే కాలం పడుతుంది. అది సాధ్యం కాదు. కాబట్టి గ్రహాంతర వాసులు ఎక్కడో అక్కడ ఉన్నా వారిని మనం చూడడం దాదాపు అసంభవం.
- -ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, -వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...