Monday, September 03, 2012

మంటలను ఆర్పడానికి నీళ్లనే ఎందుకు ఎక్కువగా వాడుతారు?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: మంటలను ఆర్పడానికి నీళ్లనే ఎందుకు ఎక్కువగా వాడుతారు?

జవాబు: మండుతున్న వస్తువుల ఉష్ణోగ్రత నీటి ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉంటుంది. మనం మంటపై నీటిని చల్లినప్పుడు ఆ నీరు మంటలోని వేడిని గ్రహించి నీటియావిరి ఏర్పడుతుంది. ఎక్కువ ఘనపరిమాణం గల ఆ నీటియావిరి మండే వస్తువుల మీద ఒక పొరలాగా ఆక్రమించడంతో మంటకు వాతావరణం నుంచి ఆక్సిజన్‌ అందదు. అందువల్ల మంట ఆరిపోతుంది. అగ్నిమాపక దళం వారు చల్లని నీటి కన్నా గోరు వెచ్చని నీటిని పైపుల సాయంతో మంటలపై చల్లుతారు. వేడిగా ఉన్న నీరు చల్లని నీటికన్నా తొందరగా భాష్పీభవన స్థానం (boiling point) చేరుకుని నీటి ఆవిరిగా మారడానికి తక్కువ సమయాన్ని తీసుకుంటుంది. అంతేకాకుండా చల్లని నీటి కన్నా వేడి నీటి తలతన్యత (surface tension) తక్కువ కాబట్టి గోరు వెచ్చని నీరు మంటలపై ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది.


-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...