ప్రశ్న: పెట్రోలు ఎలా లభిస్తుంది? అది ఎందుకు ఆవిరవుతుంది?
జవాబు: వాహనాలు నడవడానికి ఇంధనంగా ఉపయోగపడుతున్న పెట్రోలు, 'పెట్రోలియం' అనే నల్లని రంగుగల చిక్కని ద్రవం నుంచి లభిస్తుంది. లాటిన్ భాషలో 'పెట్రా' అంటే రాయి. 'ఓలియం' అంటే నూనె. ఈ రెండు పదాల నుంచి పెట్రోలియం అనే పదం పుట్టింది. అంటే రాతిచమురు. దీన్ని భూమి అంతర్భాగంలో ఉండే రాళ్ల నుంచి వెలికి తీస్తారు.
భూమి లోపలి పొరల్లో ఈ చమురు ఎలా తయారైంది? కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపైన, లోపల జరిగిన ఉపద్రవాల వల్ల అనేక మొక్కలు, జంతువులు భూగర్భంలో పూడుకుపోయాయి. భూమి లోపల ఉండే అత్యంత ఉష్ణోగ్రత, పీడనాల కారణంగా కుళ్లిపోయిన మొక్కలు, జంతువుల నుంచి ముడిచమురు ఏర్పడింది. ఆధునిక కాలంలో మానవుడు వాటిని కనుగొని దాన్ని వెలికి తీయగలిగాడు. ఈ ముడిచమురు నుంచి పెట్రోలు, నాప్తా, కిరోసిన్, డీజిల్, మైనం, మొదలైన వాటిని వేరే చేయగలిగాడు. భూమి పొరల్లోంచి డ్రిల్లింగ్ చేసి వెలికి తీసిన ముడిచమురును శుద్ధి కర్మాగారాలకు పైపుల ద్వారా పంపించి వేడి చేసి, వివిధ ఉత్పత్తులను వేరు చేస్తారు.
పెట్రోలు ద్రవకణాల మధ్య ఉండే బంధన శక్తి సామర్థ్యం చాలా స్వల్పం కావడంతో గది ఉష్ణోగ్రత వద్ద కూడా పెట్రోలు ఆవిరిగా మారుతుంది. ఇలాంటి ద్రవాలను భాష్పశీల ద్రవాలు (volatileliquids )అంటారు.
- ==============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...