ఇప్పుడు మీరు ఎగరేసి వచ్చిన జెండాకు రూపకల్పన జరిగింది ఎప్పుడో తెలుసా? 1921లో. అప్పుడు విజయవాడలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ జరిగింది. అందులో మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య తాను తయారుచేసిన జెండాను గాంధీజీకి చూపించారు. అది జాతిపితకు బాగా నచ్చేసింది. ఆ జెండాలో మొదట ఎరుపు, ఆకుపచ్చ రంగులు, మధ్యలో చరఖా బొమ్మ ఉండేది. ఎరుపు రంగు హిందువులకు, ఆకుపచ్చ రంగు ముస్లిం సోదరులకు గుర్తుగా వెంకయ్య దీనిని తయారు చేశారు. గాంధీజీ ఎరుపు, ఆకుపచ్చలకు మధ్యన తెలుపు రంగుని మిగతా మతాలకు గుర్తుగా పెట్టారు. తరువాత ఎరుపుని కాషాయ వర్ణంగా మార్చారు. కాషాయ వర్ణం ధైర్యం, త్యాగానికి, తెలుపు శాంతికి, నిజానికి, ఆకుపచ్చ నమ్మకం, పరాక్రమానికి గుర్తులుగా భావించి ఈ మార్పుల్ని చేశారు. 1931లో దానిని మన జాతీయ పతాకంగా ప్రకటించారు. 1947 జూలై 22న దీనిని స్వాతంత్య్ర భారతావనికి జాతీయ పతాకంగా ఆమోదించారు. మధ్యలో చరఖాకు బదులు అశోక చక్రాన్ని చేర్చారు.
- ======================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...