ప్రశ్న: తుపాకీ గుండు నుంచి బులెట్‌ప్రూఫ్ కార్లు, బులెట్ ప్రూఫ్ జాకెట్లు మనని ఎలా రక్షిస్తాయి?
జవాబు: మామూలు కారు అద్దాలు రాయితో కొడితే భళ్లున పగుల్తాయి. తుపాకీ గుండు వాటి నుంచి దూసుకుపోగలదు కూడా. అయితే బులెట్‌ప్రూఫ్ కారు అద్దాల విషయంలో అలా జరగదు. కారణం, ఆ అద్దాలను మామూలు గాజుతో కాకుండా అత్యంత పటిష్ఠమైన సిలికాన్ నైట్రైడ్ (silicon nitride)తో కూడిన పింగాణీ పదార్థం, అతి దృఢమైన స్టీలు, గరుకైన నైలాన్ పొరలను ఉపయోగించి తయారు చేస్తారు. దృఢమైన పింగాణీ వేగంగా వచ్చే తుపాకి గుండును హఠాత్తుగా ఆపివేయడంతో దాని శక్తి గాజు తలుపులోకి చొచ్చుకుపోకుండా ఆ ప్రదేశంలోని పైపొరలోనే వివిధ దిశలకు వ్యాపిస్తుంది. అలా వేగం కోల్పోయిన తుపాకీగుండు ఆ గాజులోని నైలాన్ పొరల వల్ల ఏర్పడిన గజిబిజి జాలీలో చిక్కుకుపోతుంది.
బులెట్‌ప్రూఫ్ జాకెట్ కూడా ఇలా ప్రత్యేకంగా తయారయిందే. దీంట్లో సుమారు 20 నుంచి 25 దృఢమైన, సున్నితమైన తేలికపాటి నైలాన్ పొరలు ఉంటాయి. ఈ పొరల్లో తుపాకీ గుండు చిక్కుకుపోతుంది.
- ==============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...