- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: మనం సౌండ్ పెంచండి అనడానికి బదులు, వాల్యూమ్ పెంచండి అంటుంటాం. సౌండ్ అంటే శబ్దం, వాల్యూమ్ అంటే ఘన పరిమాణం. శబ్దానికీ, ఘన పరిమాణానికీ సంబంధం ఏంటి?
జవాబు: శబ్దానికీ, కాంతికీ సారూప్యత తరంగ చలనమే. రెండూ తరంగాల రూపంలోనే ప్రయాణిస్తాయి. కాంతి తిర్యక్ తరంగం. కానీ శబ్దం అను దైర్ఘ్య తరంగం. కాంతికి యానకం అవసరం లేదు. కాబట్టి శూన్యంలో కూడా ప్రయాణించగలదు. కానీ శబ్దానికి యానకం అవసరం. పదార్థాల్లోకి శబ్దం ప్రసరిస్తుంది. శబ్దం అనుధైర్ఘ్య తరంగాలుగా ప్రయాణిస్తుందంటే అర్థం ఏమిటంటే అది తన మార్గంలో ఉండే పదార్థంలోని కణాల్ని లేదా పరమాణువుల్ని ఒత్తుతూ, లూజు చేస్తూ ప్రయాణిస్తుంది. ఒత్తిన ప్రాంతాల్లో దట్టంగా అధిక పదార్థం ఉండటం వల్ల అధిక పీడనంలో ఉంటాయి. లూజు చేసిన ప్రాంతాల్లో తక్కువ పదార్థం ఉండటం వల్ల తక్కువ పీడనం ఉంటుంది. పీడన ప్రాంతాలు, లూజు ప్రాంతాలు నిశ్చలముగా అవే చోట్ల ఉండకుండా శబ్ద వేగంలో కదులుతూ ఉంటాయి. ఆ శబ్ద తరంగాలే మన చెవుల్ని చేరుతాయి. అయితే శబ్దం ఏ స్థాయిలో ఉందనే విషయం, శబ్దతరంగాలలో ఉన్న సంపీడన ప్రాంతాల్లో ఎంత ఘన పరిమాణం మేరకు పదార్థం (గాలిలో అయితే ఎంత ఘనపరిమాణం ఉన్నగాలి) ఉందన్న విషయం మీద, విరళీకరణం ప్రాంతంలో ఎంత మేరకు ఘనపరిమాణం తగ్గింది (గాలిలో అయితే ఎంత ఘనపరిమాణపు గాలి తగ్గింది) అన్న విషయం మీద ఆధారపడుతుంది. ఇలా శబ్ద తరంగాలలో పదార్థపు ఘనపరిమాణపు విలువల్లో ఎంత ఎక్కువ తేడాలు సంభవిస్తే అంత ఎక్కువ మోతాదులో శబ్దం వినిపిస్తుంది. అందువల్లే శబ్దపు తీవ్రతకు, వాల్యూమ్‌కు సరాసరి సంబంధం ఉంటుంది.
- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్,--వరంగల్; కన్వీనర్, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...