Sunday, May 24, 2015

Satagopam in Temple,గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు?


  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




Q : గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు?

Ans : శఠగోప్యం అంటే అత్యంత గోప్యామైనది అని అర్థం. శఠగోపంను వెండి, రాగి, కంచుతో తయారు చేస్తారు. దాని మీద విష్ణువు పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శఠగోప్యము. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోప్యం తప్పక తీసుకోవాలి. చాలమంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి, శఠగోప్యం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.సహజంగా చిల్లర లేకపోవటం వల్ల, శఠగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము. ప్రక్కగా వచ్చేస్తాము. అలా చెయ్యొద్దు. పూజారి చేత షడగోప్యము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. శఠగోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలుంటాయి. శఠగోప్యమును తలమీద ఉంచిన ప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వార శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. శఠగోప్యమును శఠగోపం అని కూడా అంటారు.

  • ==============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...