ప్రశ్న: ఎవరినైనా చెంపపై 'ఛెళ్లు'మని కొడితే, వాతలు తేలుతాయి. ఎందుకు?
జవాబు: మన శరీరంలో చెంపపై ఉండే చర్మం మిగతాభాగాలపై ఉండే చర్మంకన్నా మెత్తగా, సున్నితంగా ఉంటుంది. ఎవరినైనా చెంపపై కొడితే చర్మం కింద ఉండే జీవకణాలు తమ నిరోధక శక్తిని కోల్పోయి చిట్లి చెల్లాచెదురవుతాయి. ఆ ప్రభావాన్ని తగ్గించడానికి అక్కడ మామూలుకన్నా అధికంగా తెల్లరక్తకణాలు అవసరమవుతాయి. వాటిని సరఫరా చేసే క్రమంలో ఆ ప్రాంతానికి రక్తప్రసరణ అధికంగా జరుగుతుంది. దీనికి తోడు అక్కడ పగిలిపోయిన కణాలలోని ద్రవం కూడా ఆ రక్తంలో కలవకుండా తెల్లకణాలు నెట్టివేస్తాయి. ఈ ప్రక్రియలో చేతివేళ్లు తీవ్రంగా తాకిన చోట చెంప మీది చర్మం కమిలి వాతలు ఏర్పడతాయి.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...