- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: పాదరసం తయారీ ఎలా జరుగుతుంది?
జవాబు: సాధారణ పరిస్థితుల్లో ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహమూలకం (metallic elements) పాదరసమే. పాదరస పరమాణువులో ఉన్న 80 ఎలక్ట్రాన్లన్నీ జతకూడి ఉండడం వల్లనే పాదరసం ద్రవ రూపంలో ఉంటుందనీ తేలిగ్గా వాయురూపంలోకి వెళ్తుందని రసాయనిక శాస్త్రం చెబుతుంది. పాదరసాన్ని భారమితి రక్తపీడన మాపనం, ఉష్ణమాపనం (థర్మోమీటర్), విద్యుత్తు బల్బులు, విద్యుద్రసాయనిక పరిశ్రమల్లో విరివిగా వాడుతున్నా ఇది కాలుష్య కారిణి. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థం. దీనికి బంగారంలాంటి లోహాలను కరిగించుకొనే లక్షణం ఉంది. పాదరసం అరుదుగా మాత్రమే దొరుకుతుంది. ప్రత్యక్షంగా లోహరూపంలో కాకుండా సిన్నబార్ అనే మెర్కురిక్ సల్ఫైడు, ఖనిజంగా పాదరసం లభిస్తోంది. ప్రధానంగా చైనా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఐరోపా, అమెరికా, కెనడా ప్రాంతాల్లో లభ్యమయ్యే ఈ లోహాన్ని గాలిలో వేడిచేయడం ద్వారా గంధకం భాగాన్ని తొలగించి పాదరసాన్ని వెలికితీస్తారు.
పాదరసం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి మరింతగా తెలుస్తుండడం వల్ల దాని వినియోగాన్ని చాలా దేశాలు నియంత్రిస్తున్నాయి.
- ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...