ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
పశ్న: ఎలక్ట్రానిక్ పరికరాలు క్రమేపీ చిన్నగా మారిపోతున్నాయి. కానీ జిరాక్స్ యంత్రాలు మాత్రం ఇప్పటికీ పెద్దగానే ఉంటున్నాయి. ఎందుకు?
జవాబు: సెల్‌ఫోన్లు, మెమొరీ డిస్క్‌లు, కంప్యూటర్లు తదితర ప్రచాలక పరికరాలు (portable devices) ఎంత చిన్నగాఉంటే అంత సులువుగా వాడుకోవచ్చు. బల్లమీద స్థిరంగా ఉండే టీవీలు, మానిటర్ల పరిమాణాలను కూడా తగ్గించడం ద్వారా అవి ఆక్రమించుకునే స్థలాన్ని ఆదా చేస్తున్నారు. ఉదాహరణకు పాత సీఆర్‌టీ (కేథోడ్ రే ట్యూబ్) టీవీలు, మానిటర్ల బదులు ఎల్సీడీ (లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే), ఎల్‌ఈడీ (లైట్ ఎమిటింగ్ డయోడ్ యారే) తెరలు రావడం తెలిసిందే. కానీ జిరాక్స్ యంత్రం ప్రయోజనాలు వేరే. ఇందులో కాగితాలు, వివిధ పరిమాణాల్లో ఉండే డాక్యుమెంట్లు పెట్టి, వాటి కాపీలు తీయాల్సి ఉంటుంది. జిరాక్స్ యంత్రంలో వాడే టోనర్ కాట్రిడ్జ్ కూడా చాలా ఎక్కువ పేజీలను జిరాక్స్ చేసేందుకు వీలుగా ఉండాలి. కాగితాలు, ఫైళ్లు పెట్టుకునేందుకు వీలుగా బల్లలోని సొరుగులు కూడా ఉంటాయి. ఈ కారణాల వల్ల జిరాక్స్ యంత్రాల పరిమాణాన్ని తగ్గించడం వల్ల అసౌకర్యమే కలుగుతుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...