- image : courtesy with Eenadu News paper.
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: అంతరిక్షంలో ఉన్నవారు భూమిపై ఉన్నవారితో ఎలా మాట్లాడుతారు?
జవాబు: మీరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మీ మాటల శబ్దతరంగాలు మొదట విద్యుదయస్కాంత తరంగాలు (electromagnetic waves)గా మారతాయి. వాటిని సెల్‌ఫోన్ కంపెనీ వాళ్లు తమ మైక్రోవేవ్ కారియర్ తరంగానికి జోడించి టవర్ల ద్వారా ప్రసారం చేస్తారు. అవి అవతలి వైపు సెల్‌ఫోన్‌ను చేరుకోగానే అందులో తిరిగి శబ్ద తరంగాలుగా మారతాయి. సాధారణంగా మైక్రోవేవ్ తరంగాలు, రేడియో తరంగాలు, తక్కువ దూరాలకు పరారుణ (infra red) తరంగాలను వాడతారు. వీటి ప్రసారానికి వాతావరణం కానీ, పదార్థాలు కానీ అవసరం లేదు. నిజానికి శూన్యంలోనే ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. అంతరిక్షంలోని వ్యోమగామికి, భూమ్మీద ఉండే కేంద్రానికి మధ్య ఇలాగే నిస్తంత్రీ (wireless) పద్ధతిలో మైక్రోవేవ్ తరంగాల ద్వారా సమాచారం బట్వాడా అవుతుంది.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య,--నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...