Tuesday, April 10, 2012

కళ్లుమూసుకుని ఉన్నప్పటికీ లైటు వేస్తే మనకు తెలుస్తుంది. ఎలా?-How can we recognise light eyeclosed?


  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: మనం కళ్లుమూసుకుని ఉన్నప్పటికీ, ఎవరైనా గదిలో లైటు వేస్తే మనకు తెలుస్తుంది. ఎలా?

జవాబు: మన కనురెప్పలు (ఐ లిడ్స్‌) పలుచగా ఉండే గోపుర పేటిక (torsal plate) లాంటి రూపంలో ఉంటాయి. ఆలుచిప్ప ఆకారంలో ఉండే ఈ కనుగవ మధ్యలో దృఢమైన బంధన కణజాలం (conjuctive tissue) ఉంటుంది. పలుచని బాహ్యచర్మ కింద రబ్బరు పొరలాగా ముడుచుకోగలిగిన పారదర్శకమైన సబ్‌క్యుటీనియస్‌ పొర ఉంటుంది. ఇలా నాలుగైదు పొరల సముదాయమే అయినా కంటి రెప్ప మందం ఒక మిల్లీమీటరుకు మించి ఉండదు. ఇందులో కాంతిని శోషించుకునే పదార్థాలు పెద్దగా ఉండవు. కాబట్టి కళ్లు మూసుకుని ఉన్నా, బయట ఉండే కాంతిలో కొంత భాగం కనురెప్పల గుండా లోనికి వెళుతుంది. రెప్పలో ఉండే సూక్ష్మమైన రక్తనాళికల గుండా కాంతి వెళ్లడం వల్ల మనకు ఆ కాంతి ఎరుపు రంగులో ద్యోతకమవుతుంది. కళ్లు బాగా అదిమిపెట్టి ఉంచినప్పుడు ముడుతలు ఎక్కువవడం వల్ల కాంతి చాలా తక్కువే వెళ్లగలగడం వల్ల మనకు నల్లగా అనిపిస్తుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...