Tuesday, December 21, 2010

పూలకన్ని రంగులేల? , Why do flowers have many colors?


ప్రశ్న: పూలు ఎందుకు రంగురంగులుగా ఉంటాయి?

-పి. కనకంబాబు, 9వ తరగతి, ఒంగోలు

జవాబు: పూలు అనేక రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించడం వెనుక ప్రకృతిలో మొక్కల పునరుత్పత్తికి దోహదం చేసే కారణం ఉంది. ఒక పూవులో ఉండే పుప్పొడి మరొక పూవును చేరినప్పుడే ఆయా మొక్కల్లో ఫలదీకరణం సాధ్యమవుతుంది. దీన్నే పరపరాగ సంపర్కం అంటారు. ఇందుకు సహకరించే కీటకాలు, పక్షులను ఆకర్షించేలా రకరకాల పూలకు రకరకాల రంగులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. అదే పక్షుల, కీటకాల ప్రమేయం లేకుండా గాలిలో పుప్పొడి ఎగరడం ద్వారా పరపరాగ సంపర్కం సంభవించే కొన్ని గడ్డిమొక్కల విషయంలో ఆకర్షవంతమైన రంగులు కలిగి ఉండాల్సిన అవసరం ఉండదు. కొన్ని మొక్కల విషయంలో పరపరాగ సంపర్కం పూర్తికాగానే, ఇక ఎవరి సాయం అవసరం లేదని తెలియజేయడానికి వాటి పూలు రంగులు కోల్పోయి, వాటి రేకులపై మట్టి రంగులో మచ్చలు ఏర్పడతాయి. దాంతో పక్షులు, కీటకాలు ఆ పూల జోలికి పోకుండా తమను ఆకర్షించే రంగులుండే పూలవైపే వెళతాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...