ప్రశ్న: శిశిరంలో చెట్ల నుండి ఆకులు రాలిపోతాయెందుకు?
-ఎ.ఆర్. మురళి, వడపళని (చెన్నై)
జవాబు: చలికాలంలో చెట్ల లోని జీవక్రియ (మెటబాలిజం) చాలా వరకూ ఆగిపోతుంది. ఆ దశలో చెట్లలో ఉండే ద్రవపదార్థం ఆకుల నుండి భాష్పీభవనం చెందకుండా, చలికాలం మొదలవడానికి ముందే ఆకులు రాలిపోవడం ప్రారంభమవుతుంది. అలా కాని పక్షంలో, చలికాలంలో చెట్లకు నీరు లేకపోవడంతో అవి చనిపోయే (ఎండిపోయే) ప్రమాదం ఉంది. వేసవి కాలంలో కూడా ఆకుల ద్వారా చెట్లలోని నీరు భాష్పీభవనం చెందినా, భూగర్భజలాలు వేళ్లద్వారా అందడం వల్ల చెట్లకు ఎలాంటి హానీ జరగదు. అదే చలికాలంలో భూగర్భజలాలు ఘనీభవించడం వల్ల చెట్లకు వేళ్ల ద్వారా నీరు అందదు. అంతే కాకుండా చెట్లు తమ ఆకులను రాల్చడం ద్వారా వాటి జీవక్రియల్లో వెలువడి ఆకుల్లో పేరకుపోయిన వ్యర్థపదార్థాలను చెట్లు వదిలించుకున్నట్లు అవుతుంది.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ===============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...