- షేక్ బికారి, 7వ తరగతి, కనిగిరి
జవాబు: మొక్కలు, జంతువులు బాగా పెరిగి జీవించడానికి అతిముఖ్యమైన వాయువు నైట్రోజన్. కాని ఈ వాయువు భూమిలో కావలసినంత ఎక్కువగా లేకపోవడంతో మొక్కలు ఈ వాయువును పునరావృతం (Recycle) చేస్తుంటాయి. మొక్కలలోని ఆకుపచ్చని రంగుకు కారణమైన క్లోరోఫిల్ అణువుల్లో నైట్రోజన్ ఉంటుంది. మొక్కలకు నైట్రోజన్ అవసరం లేనప్పుడు ఆ క్లోరోఫిల్ అణువులను బయటకు విడుదల చేస్తాయి. అందువల్లనే గోధుమపంట సమృద్ధిగా పెరిగి కోతకు వచ్చినపుడు ఇక గోధుమ మొక్కలకు క్లోరోఫిల్ అవసరం ఉండదు. అవి క్లోరోఫిల్‌ను గింజల ద్వారా కూడా విడుదల చేయడంతో మొక్కలతో పాటు గింజలు కూడా లేత బంగారు రంగులోకి మారతాయి. అలాగే ఏపుగా పెరిగి, కోతకొచ్చిన వడ్లు ఆకుపచ్చరంగు నుంచి లేత బంగారు రంగులోకి మారుతాయి.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైద్రాబాద్
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...