ప్రశ్న: సైన్సు విషయంలో చాలా చిక్కు ప్రశ్నలు వేధిస్తుంటాయి. ఉదాహరణకు 'కోడి ముందా? గుడ్డు ముందా?' అన్న మీమాంసకు సమాధానం ఏమిటి? అలాగే 'విత్తు ముందా? చెట్టు ముందా?' అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటి? వివరించండి.
- జె. శ్రీనివాస్, మిర్యాలగూడ
జవాబు: ఇలాంటి అనేక ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సవివరంగా, ససాక్ష్యంగా సమాధానాలు ఇచ్చారు. వాటి ప్రకారం చెట్టు కన్నా విత్తే ముందు. అలాగే కోడి కన్నా గుడ్డే ముందు. ఎలాగంటే బిడ్డ పుట్టాకే గత జీవి కన్నా పరిణామంలో అగ్రగామి అనగలం. బొద్దింకలు, సీతాకోకచిలుకలు, కప్పలు, పాములు, పక్షులు గుడ్లు పెడతాయి. క్రమేపీ ఒక జీవి పరిణామ క్రమం గుడ్లలో ఫలదీకృతమవుతూ తర్వాతి తరం మెరుగ్గా ఉండాలనే ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉంటుంది. అంటే గుడ్డులో కోడి కన్నా ప్రాచీన లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు సముద్రాలలోని నీరు ముందా? నదుల్లోని నీరు ముందా అంటే పారే నీరే సముద్రాలకు ఒకప్పుడు చేరిందన్న విషయం మరవకూడదు. చెట్టు ఒక తరం కాగా, దానికి మూలం విత్తనం ఏర్పడిన తొలినాటి పరిస్థితులే.
-ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...