Thursday, June 24, 2010

ఎస్కలేటర్ అంటే ఏమిటి ? , Wha is Escalator




మనం రైల్వేస్టేషన్లో, విమానాశ్రయంలో, పెద్ద పెద్ద షాప్ లలో ఇంకా ఎన్నోచోట్ల మనం మెట్లు ఎక్కాలంటే ఎంతో కష్టపడతాం. రైల్వే స్టేషన్ లో కొంతమందైతే ఆ మెట్లు ఎక్కలేక ట్రాక్ లను దాటుతూ ఉంటారు. అలా ట్రాక్ దాటుతున్నప్పుడు ఎంతోమంది తమ ప్రాణాలను వదిలేసేవారిగా ఉంటారు. కానీ ఇప్పుడు పెద్దపెద్ద రైల్వేస్టేషన్లలో ఎస్కలేటర్‌ను పెట్టి ఆ శ్రమ తగ్గించారు. దీని వలన అనేకమందికి మెట్లేక్కే శ్రమ తగ్గింది. ఎస్కలేటర్ అంటే ఏమిటి, ఎస్కలేటర్ ఎలా పని చేస్తుంది, దానిని ఎవరు కనిపెట్టారు, అది ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనం ఎక్కే అవసరం లేకుండా మెట్లే రయ్యి మంటూ పైకి వెళుతూ మనల్ను మోసుకెళ్ళే 'ఎస్కలేటర్' ను 1881 లో కనిపెట్టారు. ఆ కనిపెట్టిన వ్యక్తి పేరు 'జెస్ డబ్ల్యు రెనో'. ఇతను ఓడ కళాసి. పెద్ద పెద్ద స్తంభాలు, నిచ్చెనలు చకచకా ఎక్కి దిగే జెస్‌కు అసలు మనం కదలకుండా మెట్లే పైకి కిందకి కదులుతూంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. వెంటనే కష్టపడి, ఏళ్ళతరబడి ఆలోచించి 'ఎస్కలేటర్' ప్రాథమిక యంత్రవ్యవస్థకు అంకురార్పణ చేసారు . 'ఎస్కలేటర్' అనే మాట 1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఎగ్జిబిషన్ లో వచ్చింది. ప్రపంచంలోనే 'లిఫ్టు' లు తయారు చేయడంలో ప్రసిద్ది చెందిన 'ఓటిస్' సంస్థ తొలి ఆధునిక ఎస్కలేటర్‌ను తయారు చేసి మార్కెట్లోకి తెచ్చింది. ఎస్కలేటర్ పుట్టి వందేళ్ళు దాటిపోతున్నా ఇప్పుడిప్పుడే భారత దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ వ్యవస్థ కనిపిస్తుంది. మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కినప్పుడు కలిగే ధ్రిల్లు చెప్పనలవికానిది.
  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...