Monday, June 28, 2010

ఆడవాళ్లకు బట్టతల రాదేం? , Bald-head not seen in women-Why?





ప్రశ్న: పురుషులలో బట్టతల వస్తుంది కానీ, స్త్రీలలో రాదు. ఎందుకని?

జవాబు: అత్యంత ప్రాధాన్యత ఉన్న మెదడు ఉండేది మన తలభాగంలోని కపాలం లోపల కాబట్టి, పరిణామ క్రమంలో భాగంగా తలపై వెంట్రుకలు పెరిగాయి. పరిసరాలలోని వాతావరణ పరిస్థితుల నుంచి ఇవి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే పరిమాణ క్రమంలో వచ్చిన మార్పుల వల్లనే వెంట్రుకల ప్రాధాన్యం కూడా బాగా తగ్గింది. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు లేని బట్టతల ఏర్పడ్డం మొదలైంది. అయితే దీనికి ఎక్కువగా జన్యువులు (genes), వంశపారంపర్యత (hereditory charecteristics) కారణమవుతున్నాయి. అలాగే లైంగిక హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. పురుషులలో యాండ్రోజన్‌ హార్మోను ఎక్కువగా ఉండడం వల్ల వయసును బట్టి వారిలో పురుష విశిష్ట లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఎక్కువ కాబట్టి స్త్రీ విశిష్ట లక్షణాలు కలుగుతాయి. హార్మోన్ల మోతాదులో తేడాల వల్లనే స్త్రీలకు బట్టతల సాధారణంగా ఏర్పడదు.

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...