Wednesday, June 09, 2010

చెట్టు నీడ చల్లనేల , Shadow of trees is cool Why?




గోడనీడ వేడిగా ఉంటుంది. కానీ చేట్టు నీడ చల్లగా ఉంటుంది. ఈ తేడా ఏమిటి. ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం.....

గోడ ఓ నిర్జీవ ఘన పదార్థం. దృశ్యకాంతి ఏమాత్రం గోడలోంచి దూసుకుపోదు. కాబట్టి గోడకు ఇవతల వైపు నీడ ఏర్పడుతుంది. అయితే సూర్యకాంతిలో దృశ్యకాంతితో పాటు, అధిక శక్తిమంతమైన అతినీల లోహిత కాంతి, తక్కువ శక్తిమంతమైనదే అయినా ఉష్ణభాగం అధికంగా ఉన్న పరారుణ కాంతి కూడా ఉంటాయి. గోడ మీద పడిన కాంతిలో కొంత భాగం ఆవలి వైపున పరానవర్తనం చెందినా, మిగతా కాంతిని గోడ పదార్థం శోషించుకుంటుంది. ఇలా కాంతిశక్తి గోడలో ఉష్ణశక్తిగా మారి గోడస్ నుంచి అన్ని వైపులకు ఉష్ణవాహనం ద్వారా ప్రసరిస్తుంది. అందులో కొంత భాగం గోడకు ఇవతలివైపు కూడా వస్తుంది. దీని వల్లనే మనకు గోడ నీడలో ఉక్కపోసినట్లుగా అనిపిస్తుంది. ఇక చెట్టు ఒక జీవి. తన ఉష్ణోగ్రతను క్రమబద్దికరించుకునే యంత్రాంగం చెట్ల ఆకులకు ఉంది. ఆకుపై పడిన కాంతి కొంత పరావర్తనమైనా కొంత భాగం కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగపడుతుంది. మిగిలిన కాంతి ఆకు కణాల ఉష్ణోగ్రతను పెంచక ముందే ఆకు భాష్పోత్సేకం ద్వారా నీటి ఆవిరిని విడుదల చేస్తూ కాంతిశక్తిని తటస్థపరుస్తుంది. ఆ విధంగా తమ ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచుకునే వేలాది ఆకులను తాకి చల్లబడిన గాలి ఆ చెట్టు నీడన ఉన్న మనల్ని తాకగానే హాయిగా అనిపిస్తుంది.

  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...