మన దేశంలో నదులమీద, చెరువుల మీద రైల్వే వంతెనలు ఎన్నో కడుతుంటారు. అన్నింటిలోకీ పొడవైనదిగా కొత్త రికార్డును ఒక వంతెన పొందబోతోంది. అదే కేరళలోని కోచి దగ్గర నిర్మించిన వల్లార్‌పాదం రైల్వే వంతెన. ఇక నుంచి ఇదే 'దేశంలోకెల్లా పొడవైన రైల్వే వంతెన' కానుంది. దీని పొడవు 4.62 కిలోమీటర్లు. మరి ఇన్నాళ్లూ ఈ రికార్డు దేనిదో తెలుసా? బీహార్‌లోని సోన్‌నదిపై ఉన్న 'నెహ్రూ సేతు' అనే వంతెనది. దీని పొడవు 3.06 కిలోమీటర్లు.
ఈ కొత్త వంతెన నిర్మాణానికి 350 కోట్ల రూపాయలు ఖర్చయింది. కోచిలోని వెంబనాడ్ సరస్సుపై ఇడపల్లి నుంచి వల్లార్‌పాదం దాకా దీన్ని నిర్మించారు. ఈ వంతెనపై అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీనికి మరో రికార్డు కూడా ఉంది. అదేంటో తెలుసా? అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తయిన విశేషం కూడా దీనిదే. కేవలం ఒకటిన్నరేళ్లలో దీన్ని పూర్తి చేశారు. వంతెన నిర్మాణానికి వాడిన సిమెంటు మొత్తం 36 వేల టన్నులు.
మీకు తెలుసా!
* ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే వంతెన ఏది? బిన్హాయ్ మాస్ ట్రాన్సిట్. చైనాలోని టియాంజిన్ నుంచి టెడా వరకున్న దీని పొడవు 39 కిలోమీటర్లు.
* మరి ఎత్తయిన రైల్వే వంతెనో? 650 అడుగులతో ప్రపచంలోనే అతి ఎత్త్తెన వంతెనేమో సెర్బియాలో ఉన్న 'ది మాలా రిజెకా వియాడక్ట్'.
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...