Friday, June 25, 2010

బంగారం ఏర్పడేదెలా?, Gold preparation- how?





ప్రశ్న: బంగారపు గనులు ఎలా ఏర్పడతాయి? మన రాష్ట్రంలో బంగారపు గనులు ఎక్కడున్నాయి?

జవాబు: విశ్వం ఆవిర్భావంలో భాగంగా కొన్ని చిన్న పరమాణువులు కలవడం ద్వారా పెద్ద పరమాణువులు ఏర్పడ్డాయి. చిన్న పరమాణువులు అంటే తక్కువ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఉన్నవన్నమాట. బంగారం (Au) పరమాణువుల్లో 79 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ పరమాణువులు పరస్పరం లోహబంధాన్ని(metallic bond) ఏర్పరుచుకుంటాయి. అందువల్ల బంగారం చాలా స్థిరమైన లోహం. అంటే అది ప్రకృతిలో మూలకం రూపంలోనే లభ్యమవుతుంది. అయితే పెద్ద పరమాణువులు కాబట్టి తక్కువ మోతాదులోనే ఉంటుంది. ఇలాంటి పెద్ద పరమాణువులు ఏర్పడాలంటే అధిక పీడనం కావాలి. ఆ పరిస్థితి భూమి లోపలి పొరల్లో మాత్రమే ఉండడం వల్ల బంగారం లోతైన గనుల్లో మాత్రమే లభ్యమవుతుంది. అరుదుగా ఉండడం, వెలికి తీయడం కష్టం కావడంతో బంగారానికి విలువ ఎక్కువ. మన దేశంలో కర్నాటక రాష్ట్రంలోని కోలార్‌ ప్రాంతంలో కొన్ని బంగారపు గనులున్నాయి. ఆఫ్రికా, అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, చైనా, రష్యాల్లో బాగా ఉన్నాయి. మన రాష్ట్రంలో బంగారపు గనులు లేవు

  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...