Monday, June 28, 2010

మోల్‌ అంటే ఏమిటి? , Mol in science meaning?





ప్రశ్న: భౌతిక, రసాయన శాస్త్రాల్లో 'మోల్‌' అనే పదాన్ని వాడుతుంటారు. దాని అర్థం ఏమిటి?

జవాబు: ఆంగ్లభాషలో మోల్‌ అంటే పుట్టుమచ్చ కావచ్చు కానీ, శాస్త్రీయ పరిభాషలో ఇది ఒక సంఖ్యను సూచిస్తుంది. పండ్లు, పెన్సిళ్లలాంటి వస్తువులను లెక్కించడానికి జత అనీ, డజను అనీ వాడుతుంటాం కదా? అలాగే శాస్త్ర అధ్యయనంలో అతికొద్ది ప్రదేశాన్ని అత్యంత పెద్ద సంఖ్యలో ఆక్రమించే అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్లు, ఫోటాన్ల లాంటి అతి సూక్ష్మకణాలను మోల్స్‌లో కొలుస్తాం. మోల్‌ అంటే 6.023X10 (6023 తర్వాత 20 సున్నాలు) అనే అతి పెద్ద సంఖ్య. ఆ విధంగా మోల్‌ పదార్థరాశికి ప్రమాణం.

ఈ ప్రమాణానికి ఒక నిర్వచనం కల్పించడానికి శాస్త్రజ్ఞులు 12 గ్రాముల స్వచ్ఛమైన కార్బన్‌ మూలకాన్ని తీసుకుని, దానిలో ఉండే పరమాణువుల సంఖ్యను మోల్‌గా నిర్ణయించారు. కార్బన్‌ను ప్రమాణంగా తీసుకోడానికి కారణం విశ్వంలో జీవం ఉన్న, జీవం లేని పదార్థాలలో కార్బన్‌ పాలు ఎక్కువ. 12 గ్రాముల కార్బనే ఎందుకంటే కార్బన్‌ పరమాణు సంఖ్య 12. మొత్తానికి మోల్‌ అనేది సూక్ష్మకణాల గణనకు పరిమితమైన ప్రమాణం.


  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...