ప్రశ్న: మంచు ఎందుకు కురుస్తుంది?
జవాబు: చలికాలంలో రాత్రి వేళల్లో భూమి ఎక్కువగా ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి క్రమేణా వాతావరణం పై పొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటి ఆవిరి చల్లబడి ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అవి దుమ్ము, ధూళి వంటి అతి చిన్న కణాలను ఆవరించి గాలిలో మంచు ఏర్పడుతుంది. దీనిని పొగమంచు అంటారు. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడడంతో పొగమంచు కురుస్తున్నట్లుగా కనబడుతుంది. చలికాలంలో భూమి ఎక్కువగా చల్లబడడం వల్ల నీటి ఆవిరితో కూడిన గాలి నేలపై ఉండే చెట్ల ఆకులను, పూలను, పచ్చని గడ్డిపరకలను తాకి వాటిపై ఘనీభవిస్తుంది. అవే మెరిసే మంచు బిందువులు
- ===============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...