ప్రశ్న: గాలి ఎటు వీచినా సముద్రంలో అలలు మాత్రం తీరం వైపే వస్తాయి. ఎందుకు?
జవాబు: సముద్రపు మధ్య భాగం లోతుగా ఉన్నా తీరాన్ని సమీపించే కొద్దీ లోతు తగ్గుతుంది. చివరికి తీరం దగ్గర లోతు శూన్యం అవుతుంది. నీటిలోని కదలిక అలలు లేదా తరంగాలు. ఇవి లోతు ఎక్కువ ఉన్న సముద్రపు మధ్య భాగంలో తక్కువ తీవ్రతతోను, లోతు తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎక్కు తీవ్రతతోను ఉంటాయి. ఇందుకు కారణం శక్తినిత్యత్వ సూత్రమే. సముద్రపు మధ్యలో తలెత్తిన తక్కువ తీవ్రత ఉన్న అలలు తీరాన్ని అధిక తీవ్రతలోకి చేరతాయి. అలలు రావడం గాలి వల్ల కాదు కాబట్టి గాలి దిశకు సంబంధం లేకుండా అలలు తీరంవైపే వస్తాయి.
తుపానులు, పెనుగాలులు సంభవించినపుడు మాత్రమే గాలి వీడ్పులు అలల ఎత్తుల్ని కొంత వరకు ప్రభావితం చేస్తాయి. అలల ప్రావస్థ మాత్రమే తీరాన్ని తాకుతుంది కానీ సముద్రపు నీరు కాదు. సముద్రపు నీరు సముద్రంలోనే ఉంటుంది. అలలు కూడా తీరం దగ్గర అధిక ఎత్తుకు ఎగరడం వల్ల తీరపు అంచుల దగ్గర మన కాళ్లను తాకుతాయి. అంతమాత్రాన అలల నీరు తీరం వైపు ప్రవహిస్తుందనుకోకూడదు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్;-కన్వీనర్, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- =============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...