జవాబు: నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసంతోనే కాకుండా, ద్రాక్షరసం నుంచి తయారు చేసే 'వినిగర్'తో కూడా తొలగించవచ్చు. కుళాయిలపై వాటిలో ప్రవహించే నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం అయాన్ల వల్ల ఏర్పడే లవణాల మూలంగా తెల్లని సున్నపు మరకలు ఏర్పడతాయి. ఉప్పునీటిలో ఈ లవణాల శాతం అధికంగా ఉంటుంది. కుళాయిలపై నీటి అణువులు భాష్పీభవనం చెందిన తర్వాత ఈ మరకలు శాశ్వతంగా ఉండిపోతాయి. వీటిని ఏ రసాయనిక ద్రావకం ద్వారానైనా తొలగించవచ్చు. కానీ అతి గాఢత కలిగిన ఆ ద్రావకాల వల్ల రసాయనిక చర్యలు జరిగి కుళాయిలు తయారయిన లోహాలు కరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ కుళాయిలపై సున్నపు మరకలు పడిన ప్రదేశాలను అతి తక్కువ గాఢత ఉండే నిమ్మరసం లేక వినిగర్‌తో రుద్దితే, నిమ్మరసంలోని సిట్రిక్ ఆమ్లం, వినిగర్‌లో ఉండే ఎసిటిక్ ఆమ్లం, ఆ కుళాయిలకు అంటుకుపోయిన తెల్లటి సున్నపు మరకలను అంటే ఆ లవణాలను తొలగిస్తాయి. తర్వాత ఆ ప్రదేశాలను నీటితో కడిగితే, కుళాయిలు మునుపటి లాగే మెరుస్తుంటాయి.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- ======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...