Wednesday, December 24, 2014

డెడ్‌సీ లో మనుషులు-వస్తువులు మునగవా?,Articles not sink in Dead sea?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  


  •  
ప్రశ్న: డెడ్‌ సీ (మృత సముద్రం)లో మనుషులే కాకుండా వస్తువులు కూడా తేలుతాయా?
జవాబు: డెడ్‌సీ (Dead sea) అని పిలిచే మృత సముద్రం మిగతా సముద్రాలతో సంబంధం లేకుండా ఒక పెద్ద కొలనులాగా ఉంటుంది. సుమారు 50 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో ఇజ్రాయిల్‌, జోర్డాన్‌ దేశాల మధ్య విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తులో ఉన్న సరస్సు. దీంట్లో సముద్రాలలో కన్నా లవణీయత పదిరెట్లు ఎక్కువ. అంటే ఉప్పు వంటి అనేక లవణాల గాఢత విపరీతంగా ఉండడం వల్ల ఇందులో చేపలు, తిమింగలాలు, నాచు, కోరల్స్‌ వంటి పెద్ద జీవజాతులు బతకలేవు. అందుకే దీన్ని మృత సముద్రం అన్నారు. కేవలం తక్కువ స్థాయిలో కొన్ని బాక్టీరియాలు, ఫంగస్‌ జీవులు ఉంటాయి.
మృతసముద్రంలో ఉప్పు శాతం విపరీతంగా ఉండడం వల్ల ఈ నీటి సాంద్రత 1.24 గ్రా/మి.లీ. ఉంటుంది. అందుకే మనుషులు తదితర జీవులు మునగవు. ఈత కొట్టవలసిన అవసరం లేకుండానే నీళ్లలో తేలవచ్చు. మనుషులు మునగనంత మాత్రాన మిగతా వస్తువులు కూడా మునగవని అనుకోడానికి లేదు. ప్లవన సూత్రాల ప్రకారం ద్రవాల సాంద్రత కన్నా వస్తువుల సాంద్రత ఎక్కువయితే ఆ వస్తువులు ఆ ద్రవంలో మునుగుతాయి. తక్కువయితే తేలుతాయి. కాబట్టి 1.24 గ్రా/మి.లీ. కన్నా ఎక్కువ సాంద్రత ఉన్న ఇనుము, రాళ్లు వంటివి తప్పకుండా మునుగుతాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...