జ : ప్రస్తుత వైద్యులు రోగిని తాకడం తగ్గించారు. . కానీ పాతరోజుల్లో వైద్యులు తమ రోగిని ముంజేయి దగ్గర పట్టుకుని చూసేవారు. అది నాడిని పట్టుకోవడము అని మనము అనుకుంటాము . వాస్తవములో వైద్యుడు రక్తనాళము పట్టుకుని చూస్తాడు . రక్తనాళము లో రక్తము ఒక క్రమవేగముతో ప్రవహిస్తుంది. అది కాకుండా ధమని గోడలు గుండె కొట్టుకోవడము మాదిరిగానే పల్స్ కొట్టుకొంటుంది. అది ఎన్నిసార్లు కొట్టుకుంటున్నాదో లెక్కపెడతారు. అనారోగ్యానికి గురి అయినప్పుడు ఆ రక్తప్రవాహ వేగము మారుతుంది. ఆ వేగము తగ్గిందా , పెరిగిందా అనేది చేయి పట్టుకుని తెలుసుకొని దానిని బట్టి రోగాన్ని అంచనావేయడము వైద్యులు చేస్తారు.
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...