Wednesday, May 05, 2010

సన్ డే అంటే ఏమిటి ? , What is Sun Day ?




ఇవాళ 'సన్‌'డే. 'అదేంటి? సోమవారం కదా?' అని ఆశ్చర్యపోకండి. మదర్స్‌డే, ఫాదర్స్‌డే, చిల్డ్రన్స్‌డే లాగే సూర్యుడికీ ఓ రోజుంది. మే 3 అంతర్జాతీయ సూర్యుని దినం. మరి సూరీడు చెప్పే వింత నిజాలు తెలుసుకుందామా!

* మన భూమితో పోలిస్తే సూర్యుడు ఎంత పెద్దవాడో తెలుసా? భూమిని గుండు సూది తల అనుకుంటే, సూర్యుడు బాస్కెట్‌ బాలన్నమాట.
* సూర్యుడు ఒక గోళం అనుకుంటే అందులో ఎన్ని భూగోళాలు పడతాయో తెలుసా? 10 లక్షలు!
* సూర్యుడి వయసు 460 కోట్ల సంవత్సరాలు. మరో 500 కోట్ల ఏళ్ల వరకు సరిపడినంత హైడ్రోజన్‌ సూర్యుడిలో ఉంది.
* సూర్యుడి మధ్య భాగంలో ఎంత వేడి ఉంటుందో తెలుసా? 1,50,00,000 డిగ్రీల సెల్సియస్‌.
* సూర్యుడి బరువుతో సమానంగా తూగాలంటే ఎన్ని భూగోళాలు కావాలో తెలుసా? 3 లక్షలు!
* మీరు ఒక కారులో సూర్యుడి దగ్గరకు బయలుదేరారని అనుకోండి. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పయనించినా అక్కడికి చేరడానికి 200 ఏళ్లకుపైగా పడుతుంది. సూర్యుడు మన భూమి నుంచి 14,96,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు మరి.
* సూర్యుని ఉపరితలం నుంచి వెలువడిన కాంతి 8.3 నిముషాల్లో భూమిని చేరుతుంది.
* సూర్యుని ఆకర్షణ శక్తి ఎంత గొప్పదో తెలియాలంటే ఫ్లూటోని అడగాలి. సూర్యుడి నుంచి 590 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఇది ఆయన ఆకర్షణ పట్టులోనే ఉంది.
* తన చుట్టూ తాను తిరగడానికి సూర్యుడికి 27 రోజులు పడుతుంది.
* సూర్యుడి నుంచి ఒక్క సెకనులో విడుదలయ్యే శక్తి మన వెయ్యేళ్ల అవసరాలు తీరుస్తుంది

  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...