మన శరీరంలో ఎన్ని కణాలుంటాయి? కణం ఎంత పరిమాణంలో ఉంటుంది?
జవాబు:
ఒక సాధారణ మనిషిలో సుమారు 10 వేల కోట్లు నుంచి వంద లక్షల కోట్లు వరకు జీవకణాలుంటాయి. ఒకో కణం పరిమాణం శాస్త్రీయ పరిభాషలో 10 మైక్రాన్లు ఉంటుంది. ఒక మిల్లీమీటరులో వెయ్యో వంతు భాగాన్ని లేదా మీటరులో పదిలక్షలవ వంతు భాగాన్ని మైక్రాన్ అంటారు. ఇక బరువు విషయానికి వస్తే మిల్లీగ్రాములో పదిలక్షలవ వంతు ద్రవ్యరాశి మాత్రమే ఒకో కణం తూగుతుంది. రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665లో సూక్ష్మదర్శిని సాయంతో కణాలను కనుగొన్నాడు. స్కీడన్, ష్వాన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు 1839లో జీవానికి ప్రాథమిక ప్రమాణం కణాలే అని తేల్చారు. దీన్నే కణసిద్ధాంతం అంటారు. ఏయే కణాలు ఎంతెంత కాలం మన్నుతాయన్న విషయం ఆయా కణాల తత్వాన్ని బట్టి ఉంటుంది. చర్మం మీద కణాలు చాలా తొందరగా పోయి కొత్తవి వస్తుంటాయి. రక్తకణాలు కొన్ని రోజుల పాటు ఉండగలవు. అదే మెదడు కణాలు, నాడీ కణాలు ఎక్కువ కాలం (దాదాపు దశాబ్దాల వరకు) ఉంటాయి. గుండె కణాలు కూడా చాలా కాలమే ఉంటాయి.
- ==============================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...