![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhI_UeyTw_cHKMW5RsYqnb1b2SDBQrLphNmxL4vckw2GUvGj7wflSBih_egJ1c4tTkgyF848j4wywkjW-ZQkXYJAHS0ACiZXS5JlKo3ZHV7_pr_ZLZFLiOT7Tvz_6JTmaattQsoG_0jynxT/s400/Magnetic+Man.jpg)
మీరు మలేషియా వెళ్లి 'మ్యాగ్నెటిక్ మేన్' తెలుసా అని ఎవరినైనా అడగండి. 'ల్యూతో లిన్ కదా? ఎందుకు తెలియదు?' అని ఎదురు ప్రశ్నిస్తారు. ఆయన అంత ప్రముఖుడు మరి. ఈ 78 ఏళ్ల అయస్కాంత తాతయ్య దగ్గరకి చెంచాలు, రేకులు, కడ్డీలు, ఇస్త్రీ పెట్టెలు ఇలా ఏ ఇనుప వస్తువైనా తీసుకెళ్తే చటుక్కున అంటుకుపోతుంది. అందరూ సరదాగా 'హలో.. మిస్టర్ మాగ్నట్' అంటారందుకే. ఈ శక్తి లిన్‌కే కాదు, ఆయన ఇద్దరు కొడుకులు, ఇద్దరు మనుమలకి కూడా ఉంది.
చెంచాలే కాదు 36 కిలోల బరువున్న ఇనుప వస్తువులు కూడా ఆయనకి అతుక్కుని ఊడిరావు. లిన్ తాతయ్య ఒంటికి కొక్కెం ఉన్న రేకును అతికించి, ఆ కొక్కేనికి ఇనుప గొలుసు తగిలించి, రెండో కొసను బస్సులకి, కార్లకి తగిలించినా లాగేస్తాడు! ఇంతకీ ఈయన శరీరానికి నిజంగానే అయస్కాంత శక్తి ఉందా? లేదనే చెబుతున్నారు ఈయనపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు. ఈయన శరీరానికి ఇనుప వస్తువుల్ని పీల్చుకునే గుణం ఉందిట. లిన్ తాతయ్య మంచి వాడు కూడా. తనకున్న ఈ శక్తితో ప్రదర్శనలు చేసి ఆ డబ్బుని బడుగులకి విరాళంగా ఇస్తాడు.
- ===========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...