రంగురంగుల ఇంద్రధనుస్సును చూస్తే ఆనందిస్తారా? అయితే ఆ పాముని చూసి కూడా అలా చేయండి. 'అమ్మో..' అంటారు కదూ! మీరు ఆనందించినా, భయపడినా ఆ పాము పేరు మాత్రం 'రెయిన్‌బో స్నేక్'. అంటే ఇంద్రధనుసు పామన్నమాట. ఇంద్రధనుస్సు మీదుగా పాక్కుంటూ వచ్చిందా అన్నట్టుగా, దీని ఒంటి మీద ఎన్నో రంగులు కనిపిస్తాయి. ఈ పాముని ఈమధ్యనే కొత్త జాతికి చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. నిజానికి ఇది ఎప్పటి నుంచో తెలిసినా, వేరే జాతిదనుకున్నారుట. ఆ తర్వాత జరిగిన పరిశోధనల వల్ల దీనికో ప్రత్యేకమైన జాతి ఉందని బయటపడింది. అంటే ఒక విధంగా 'సరికొత్త పాత పాము' అన్నమాట.ఇక దీని కోరలు, నాలుక చూస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఎందుకో తెలుసా? మండుతున్న నిప్పులాగా ఎర్రటి రంగులో ఉంటాయి. కోరల్లో విషం లేకున్నా కాటేస్తే భరించలేని నొప్పి పుడుతుంది. అయిదడుగుల పొడవు వరకూ పెరిగే ఇది ఎక్కువగా దక్షిణాసియాలోని మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, ఇండోనేషియాల్లో కనిపిస్తుంది. ఆహారంగా కప్పలతో పాటు బల్లుల్ని, తొండల్ని కూడా ఆంఫట్ అనిపించేస్తుంది. దీనిలో వింతైన లక్షణం ఏంటో తెలుసా? కోపం వచ్చిందనుకోండి, దీని మెడ ముదురు నారింజ రంగులోకి మారిపోతుంది.
- ===============================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...