ప్రశ్న:
భూమి గుండ్రంగా ఉంటుంది కదా? మరి భూమికి కింది వైపు ఉన్నవారు కింద పడిపోరెందుకని?
జవాబు:
భూమి మీద ఏదైనా వస్తువు ఉండడానికి కారణం భూమి ఆ వస్తువును తన కేంద్రం వైపు ఆకర్షించడమే. ఈ ధర్మాన్ని గురుత్వం (గ్రావిటీ)అనీ, దాని వల్ల కలిగే శక్తిని గురుత్వాకర్షణ శక్తి అని అంటారు. భూమి మీద ఉండే వస్తువులతో పోలిసే భూమి పరిమాణం చాలా చాలా ఎక్కువ. అందువల్లనే భూమి ఎక్కడికక్కడ సమతలంగా, బల్లపరుపుగా ఉన్నట్లు కనిపిస్తుంది.
ఉదాహరణకు ఒక ఫుట్‌బాల్‌పై ఒక చీమ తిరుగుతోందనుకోండి. మనకి ఆ బంతి గుండ్రంగానే కనిపిస్తున్నా, చీమకు మాత్రం బంతిపై ప్రతి భాగం ఎక్కడికక్కడ బల్లపరుపుగానే అనిపిస్తుంది. అలాగే మన భూమిపై ఏ ప్రదేశం మీద ఉన్నా, మనం కిందకి ఆనుకునే దిశ మన పాదాల నుంచి భూకేంద్రం వైపు ఉన్న దిశే అవుతుంది. ఆ దిశలోనే భూమ్యాకర్షణ శక్తి పనిచేయడం వల్ల భూమిపై ఉండే ప్రతి వస్తువూ భూమిని అంటిపెట్టుకుని ఉంటుందే తప్ప భూమి నుంచి పడిపోదు. అందువల్ల భూమికి కింది వైపు అనే ప్రశ్నే తలెత్తదు.
- =================================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...