![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiRbufVoAF0cLgCjVlR7ux82iU-Fyrr2vZEBTzqNijJyWchQutTynZmu7b49_0X5uKgRxXAa_EsUMwHni6VXRajnlwsPmHcozpsrcmOdmfWgC1Zn4niu7tv-x0gji6zx5xqLvmmMYW71HIq/s400/notlOnumchi+aa+pogalemiti.-img.jpg)
ఉదయం వేళల్లో అప్పుడప్పుడు మాట్లాడుతుంటే నోటి లోంచి పొగలు వస్తాయెందుకు?
జవాబు:
అవి పొగలు కావు. పైగా ప్రతి ఉదయం అలా జరగదు. కేవలం శీతాకాలంలో బాగా చలిగా ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. మనం మాట్లాడుతున్నప్పుడు శ్వాసప్రక్రియలో నిశ్వాసాన్ని (exhalation) వదులుతాము. అంటే మాటలతో పాటు ఊపిరితిత్తుల నుంచి గాలి కూడా బయటపడుతుందన్నమాట. ఏ కాలమైనా మన శరీర ఉష్ణోగ్రత మాత్రం 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్ (సుమారు 37 డిగ్రీల సెంటిగ్రేడు) దగ్గర స్థిరంగా ఉంటుంది. శీతకాలంలో మన నోటి లోంచి బయటకి వచ్చే గాలిలో నీటి ఆవిరి ఉంటుంది. బయటి ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉండడం వల్ల ఆ నీటి ఆవిరిలో చాలా భాగం వాయు స్థితి నుంచి ద్రవస్థితికి మారుతుంది. ఆ క్రమంలో నీటి ఆవిరిలోని అణువులు సూక్ష్మబిందువులుగా తుంపరగా మారతాయి. వాటి మీద సూర్యకాంతి పడి, అది అన్ని వైపులకు విక్షేపణ (scattering) చెందుతుంది. అందువల్లనే అది పొగలాగా కనిపిస్తుంది. ఐసుగడ్డ మీద పొగలున్నట్టు కనిపించడం, జెట్ విమానం వెనుక పొగ కనిపించడానికి కూడా కారణం ఇదే.
- =================================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...