మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్క. (ఈ తరువాత ఆధ్యాత్మిక జీవితమే తరువాయి అని గుర్తు. దీనికోసమే షష్టి పూర్తి ఉత్సవం చేసి, పిల్లలకు బాధ్యతలు ఒప్పగించి, వాసనప్రస్థులవుతారు.
షష్టి పూర్తి మహోత్సవము లో జ్యోతి శాస్త్ర రహస్యం ఉన్నది ... "ఉగ్రరధ" అనే భయంకర దోషము అరవై నిండగానే మనిషి కి ఆవహిస్తుంది . దానివల్ల భయంకర శోకము ను మానవులు పొందుదురు . అందువల్ల షష్టి పూర్తి కార్యక్రమము లో భాగంగా ' ఉగ్రరధ ' దోషనివారణ కార్యక్రమనూ జరుపుకుంటారు .
మనది ఎంతో పవిత్రమైన, ఆదర్సవంతమైన సత్సంప్రదాయమైన సంస్కృతి. మన పెద్దలు దూరదృష్టి తో, సమాజ శ్రేయస్సుతో ఆలోచించి కొన్ని ఆచారములను, సంస్కారములను మనకు చెప్పియున్నారు. అట్టి సంస్కారములలో ఒకటి ఈ షష్టి పూర్తి మహోత్సవము.
షష్టి పూర్తి అనగా అరువది సంవత్సరములు ఆయువు పూర్తి అయిన పిదప మరల అరువది సంవత్సరముల ఆయువును ప్రసాదించమని భగవంతును కోరుచూ చేయు ఉత్సవము. దీనినే షష్టి పూర్తి మహోత్సవం అని అంటారు. ఈ షష్టి పూర్తి మహోత్సవం నే అమృతోత్సవం అని కుడా అందురు. అమృత + ఉత్సవం అమృతము అనగా మోక్షము . ఉత్సవం అనగా ఆనందమును పుట్టించు శుభకార్యము. మోక్షమును, అమితానందమును కలిగించమని ఆ భగవంతుని కోరుకోనుచు చేయు శుభకార్యమే" అమృతోత్సవము ".
ఈ ఉత్సవమును అరువద్ది సంవత్సరములు పూర్తి అయిన తల్లితండ్రులకు వారి సంతానము చేయదగినట్టిదే ఈ మహోత్సవం. ఇందు ఆయుష్కామన యజ్ఞము కూడా జరిపించబడును. అనగా ఆయు: + కామన + యజ్ఞము - ఆయు: అనగా ఆయువు, కామన అనగా కోరి, యజ్ఞమనగా శ్రేష్టమైన, పవిత్రమైన మరియు భగవంతునికి ప్రేతి పాత్రమైన శుభకర్మ. దీనిద్వారా నిండు నూరేళ్ళు ఆయువును ప్రసాదించమని పరమాత్మను కోరుకోనుచు చేయు శ్రేష్టమైన కర్మే " ఆయుష్కామన యజ్ఞ " మందురు. ఈ ఉత్సవమును యజ్ఞము ద్వారా శాస్త్రజ్ఞానము కలిగిన బ్రాహ్మణుల ద్వారా జరిపించుట శ్రేష్టము. ఇది కడు ఉత్తమోత్తమైన సత్కర్మ. ఈ కార్యక్రమము జరుగుచుండగా ఆ తల్లితండ్రులు పొందు ఆనందానుభూతిని వర్ణించలేము. అది స్వయముగా చూడవలయును. మన ప్రత్యక్ష - సాకార దేవతల పూజ అంటే ఇదే. ఇది ఎంతో పుణ్యం చేసుకున్న గుణవంతులైన సంతానమునకు మాత్రమె లభించును. ఇట్టి సేవ, పూజ కొన్ని లక్షలు, కోట్లు గుమ్మరించినా ఈ ఫలము లభించదు. ఈ సంస్కారమునే సాకార - ప్రత్యక్ష దేవతల పూజ అనియు అంటారు.
- ==========================================
A lot of information has been given,however more information can be added like the procedure normally followed by people in andhra pradesh
ReplyDelete