Thursday, May 19, 2011

ఖుజురహో సంగతులేమిటి ?, What about Khujuro in India



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

భారతీయ శిల్పకళ , సంగీతం , నృత్యం , కామకళ తో సహా ఇతర కళలన్నింటినీ సజీవం గా మలచిన దేవాలయాల నియలం ఖుజురహో . 10 వ శతాబ్దం లో ' చండేలా రాజ వంశస్థులు " నిర్మించారని చరిత్ర చెబుతోంది . మొత్తం 85 మందిరాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నా నేడు మిగిలినవి 20 మందిరాలే . మిగతావి శిధిలమై పోయి ఉంటాయి . ఇవి శైవ , వైష్ణవ , జైన , తాంత్రిక మందిరాలు . చండేలా రాజ వంశ పతనం తర్వాత ఆ ప్రాంతం వదలివేయబడినది . . ఆ దేవాలయాల చుట్టు అడవులు పెరిగి కనిపించకుండా పోయాయి .
అటువంటి దేవాలయాలు తిరిగి బ్రిటిష్ పాలనలో ఒక ఇంజనీర్ కంటపడి వెలుగు చూసాయి . నాటినుండి ఖజురహో శిల్పాలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఆ శిల్ప కళలను కామసూత్ర ఆధారము గా మలిచారనిపిస్తుంది . ఆ విధం గా భారతీయ సంస్కృతి మహోన్నతమైనదని అన్నిదేశాలవారూ కొనియాడారు . ఖజురహో వచ్చిన విదేశీయులు , యాత్రికులు వెయ్యేళ్ళ క్రితమే భారతీయ సంస్కృతి ఇంత ముందున్నదా ! అని ఆశ్చర్యపోతుంటారు . దేవాలయాల గోడలపైన అటువంటి లైంగిక శిల్పాలు ఎందుకు చెక్కిఉంటారో ఇప్పటికీ ఎవ్వరికీ అర్ధం కావడంలేదు . వారు ఎందుకోసము చేసినా నేడు మనకు కనువిందు చేస్తుంటాయి ... అందుకే ఖజురహో ఒక్కసారైనా తిలకించాలి
ఖజురహో నేటి మధ్యప్రదేశ్ రాస్ట్రం లో పలు పర్యాటక క్షేత్రాలలో ముఖ్యమైనది గా చెప్పుకోబడుతున్నది . ఢిల్లీ నుండి వారణాసి వెళ్ళే విమానాలు ఖజురహో లో ఆగి వెళ్తాయి. రైల్ లో వెళ్ళేవారు ఝాన్సీ, లేదా సాత్నా రైల్ స్టేషన్‌ దిగి బస్ లో ఖజురహో వెళ్ళవలసి ఉంటుంది .
  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...