Sunday, May 22, 2011

పంచ కన్యలు అంటే ఎవరు?హిందూ పురాణాలలో, Who were the five Virgins in Hindu Epics?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


పంచ కన్యలు అంటే ఎవరు?హిందూ పురాణాలలో, Who were the five Virgins in Hindu Epics?

నేటి తరం బాలలకు పాత తరం విషయాలు : హిందూపురాణాలలో కొంతమంది దేవతా స్త్రీలు వరము వలనో , శాపము వలనో మానవ జన్మ ఎత్తి ధర్మ పరిరక్షణ , దుష్ట శిక్షణ చేయు నిమిత్తము వారి అసలు శరీరము దేవలోకములో విడిచి మాయాశరీర ధారియై మానవులుగా జన్మించిన వారిలో ఈ పంచకన్యలు ముఖ్యమైనవారు . మాయా విధ్య మహత్యము వలనే వారు కన్యలు గానే పురాణాలు , పురాణ పురుషులు , మునీశ్వరులు చే చెప్పబడినారు . వీరినే పురాణ పతివ్రతలు అని కూడా అంటారు .

  • 1. తార
  • 2. అహల్య
  • 3. మండోదరి
  • 4. కుంతి
  • 5. ద్రౌపది

1.తార --వానర రాజైన వాలి భార్య. కిష్కింధ కాండలో వాలిసుగ్రీవులతో తార పాత్ర చిత్రించబడినది. వీరి కుమారుడు అంగదుడు.సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని రెండవసారి యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలుదేరిన వాలిని తార వారింప ప్రయత్నించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి రావడానికి రామలక్ష్మణుల అండయే కారణం కావచ్చు అని హితం పలికింది. కాని వాలి వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక ఆ ధర్మపరులు తనకు హాని
చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు. అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.-source : Tara in wikipedia

2.అహల్య---ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది. వీరికి నలుగురు కుమారులు, వారిలో జేష్టుడు శతానంద మహర్షి. బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెపుతాడు. గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు
చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని. ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్ళి చేయమని చెపుతాడు. -source : Ahalya



3.మండోదరి--మండోదరి' రామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు.-- Source : Mandodari

4.కుంతీదేవి --- మహాభారతం లో పాండవుల తల్లి. పాండురాజు భార్య. కుంతీదేచి చిన్నతనంలో దుర్వాసుడు ఆమెకు ఒక వరం అనుగ్రహించాడు. ఈ వరం ప్రకారం, ఆమె తాను కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమయ్యి వారి వలన ఆమెకు సంతాన ప్రాప్తి కలిగేలా ఒక వరం ప్రసాదించాడు. ఆమె వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా భవిష్యత్తులో అవసరమౌతుందని బదులిస్తాడు. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడం కోసం ఒక సారి సూర్యుని కోసం ప్రార్థిస్తుంది. ఆమె తెలియక మంత్రాన్ని జపించాననీ, సూర్యుణ్ణి వెనక్కి వెళ్ళిపోమని కోరుతుంది. కానీ మంత్ర ప్రభావం వల్ల ఆమెకు సంతానం ప్రసాదించి కానీ తిరిగివెళ్ళలేనని బదులిస్తాడు. ఆమెకు కలిగే సంతానాన్ని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలివేయమని కోరతాడు. అలా సహజ కవచకుండలాలతో, సూర్య తేజస్సుతో జన్మించినవాడే కర్ణుడు.-- Source : Kuntidevi


5.ద్రౌపది-- దృపద మహారాజు యాగపుత్రిక. పాండవుల సతి. మహాభారతంలొ అతిముఖ్య పాత్రదారి.--source : Draupathi
  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...