ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్రశ్న: ఆపిల్ పండును ముక్కలుగా కోసిన కాసేపటికి వాటి రంగు బ్రౌన్‌గా మారుతుంది. ఎందుకు?
జవాబు: ఆపిల్ పండులో 'టానిక్ యాసిడ్' అనే రసాయనిక ద్రవం ఉంటుంది. మనం ఆపిల్ పండును ముక్కలుగా కోసినప్పుడు ఆ భాగాలకు గాలి తగులుతుంది కదా? అప్పుడు వాటిలోని టానిక్ యాసిడ్‌కి, గాలిలోని ఆక్సిజన్‌కి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది. ఫలితంగా పాలీఫినాల్స్ (poly phenols) అనే పదార్థం ఏర్పడుతుంది. ఆక్సీకరణం (Oxidation) అనే ఈ చర్య వల్ల ఏర్పడే పాలీఫినాల్స్ బ్రౌన్ రంగులో ఉంటాయి. అందువల్లే ఆపిల్ ముక్కలు ఆ రంగులోకి మారతాయి. అలా రంగు మారకుండా ఉండాలంటే కోసిన భాగంపై నిమ్మరసం చల్లాలి. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆపిల్ పండులో ఉండే టానిక్ యాసిడ్‌పై పొరలాగా ఏర్పడి ఆక్సీకరణం జరగకుండా అడ్డుకుంటుంది.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =======================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...