ప్రశ్న: పెయింట్ బ్రష్‌ను నీళ్లలో ముంచితే దాని వెంట్రుకలు అన్నివైపులకు విచ్చుకుంటాయి. నీటిలో నుంచి బయటకు తీస్తే అవన్నీ ఒకదానితో ఒకటి అంటుకుపోతాయి. ఎందుకని?
- కె. రాజీవ్, 10వ తరగతి, యానాం
జవాబు: పెయింట్ బ్రష్ వెంట్రుకలు నీటిలో విచ్చుకోడానికి, బయటకు తీసినప్పుడు అతుక్కుపోడానికి కారణం నీటికి ఉండే తలతన్యత (surface tension) అనే భౌతిక ధర్మమే. దీని ప్రకారం నీటి ఉపరితలం, నీటి పొరలు సాగదీసిన రబ్బరు పొరలలాగా స్థితిస్థాపకత (elasticity), తన్యత (tension) కలిగి ఉంటాయి. వీటికి స్వేచ్ఛనిస్తే అవి కనిష్ఠ ఉపరితల వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి.
పెయింట్ బ్రష్‌ను నీటిలో ముంచినప్పుడు దాని వెంట్రుకల మధ్య చేరిన నీరు సాగదీసిన పొరల రూపంలో ఉండడంతో వెంట్రుకలు ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరిగి నీటిలో పరుచుకుంటాయి. బ్రష్‌ను నీటిలో నుంచి బయటకి తీసినప్పుడు, ఆ పొరలకు స్వేచ్ఛ లభించి వాటి ఉపరితల వైశాల్యం కనిష్ఠ పరిమాణం పొందడానికి ప్రయత్నిస్తాయి. దాంతో బ్రష్ వెంట్రుకలు ఒకదానికొకటి దగ్గరై అంటుకుని పోతాయి.
ఈతకొట్టే వ్యక్తి తల వెంట్రుకలు నీటిలో చెదిరిపోయి, నీటిలోంచి లేవగానే తలను అంటుకు పోవడానికి కూడా ఇదే కారణం.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ==============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...