విశ్వమంతా గోళాకారంలో ఉన్నపుడు 360 డిగ్రీలకంటే మించిన కోణం ఉండే సావకాశం లేదని గుర్తించిన పాశ్చాత్య ఖగోళ శాస్త్రజ్ఞులు, దీనిని 12 విభాగాలు చేశారు. ఒక్కో విభాగానికి 30 డిగ్రీలు (కోణం) కలిగినపుడు, దీనిని ఒక రాశి అన్నారు. ఆ రాశుల పేర్లు దాదాపుగా మనకూ, పాశ్చాత్యులకూ సమానంగానే ఉన్నాయి. 1. మేషం 2.వృషభం 3. మిథునం 4.కర్కాటకం 5.సింహం 6. కన్య 7.తుల 8. వృశ్చికం 9.ధనుస్సు 10. మకరం 11. కుంభం 12. మీనం.
1 .మనం ఉన్న స్థలంనుండి (భూగోళంనుండి) గ్రహాలను పరిశీలిస్తే ఏ కోణంలో కనబడుతుందో, దానిని బట్టి, (ఆ కోణంలో) ఆ రాశిలో ఫలానా గ్రహం సంచరిస్తోందని గుర్తిస్తూ, గ్రహగతులను గణిస్తున్నారు. వీటిని బట్టే నెలలు ఏర్పడుతున్నాయి.
2.ఇలా సూర్యుడు 360 డిగ్రీలు (కోణాలు) (అంటే 12 రాశులలో) సంచరించగా ఒక సంవత్సరం పూర్తి అవుతుంది. సూర్యగతిని బట్టి, చంద్రగతినికూడ సమన్వయ పరుస్తూ కాలాన్ని కొలుస్తారు .
3.సంచరించేటపుడు, ఒక రాశిని దాటడానికి గ్రహాలకు పట్టే కాలం - సూర్యుడు (30 రోజులు), చంద్రుడు (రెండున్నర రోజులు), కుజుడు 11 న్నర రోజులు, బుధుడు (ఒక నెల), గురువు (ఒక సంవత్సరం), శుక్రుడు (ఒక నెల), శని (రెండున్నర సంవత్సరాలు), రాహు కేతువులు (ఒకటిన్నర సంవత్సరాలు). ఒక రాశినుండి, పై రాశిలోకి మారే కాలాన్ని సంక్రమణం అంటారు.
4.గ్రహ సంచారాల వల్ల మారే స్థితులను బట్టి, మనుష్య జీవనంలో కలిగే ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఆ నాటి, ఆ నెల, సంవత్సరపు స్థితిలో మేలు, కీడు చేయగలిగిన గ్రహాలనూ, కాలాలనూ గుర్తించారు. గ్రహము మనకు కనబడితే ఉదయించినదనీ, కనబడకపోతే అస్తమించినదనీ అంటారు.
5.మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్క. (ఈ తరువాత ఆధ్యాత్మిక జీవితమే తరువాయి అని గుర్తు. దీనికోసమే షష్టి పూర్తి ఉత్సవం చేసి, పిల్లలకు బాధ్యతలు ఒప్పగించి, వాసనప్రస్థులవుతారు)
6.కాబట్టి, పుట్టినప్పటినుండి 60 సంవత్సరాలను లెక్కించేందుకై, ప్రతిసంవత్సరాన్ని ఒక నామంతో వ్యవహారం చేయడం భారతీయుల విశేషత.
7.అబ్దం అనగా సంవత్సరమే. సంవత్సర గణనంలో మరో ముఖ్యమైన కొలబద్ద యుగాలు. ఒక ముఖ్యమైన ఘటన, లేదా పుణ్యపురుషుడి జన్మను బట్టి, ఆయా శకాలను గణిస్తారు. ప్రస్తుతం కలియుగ ప్రారంభాన్ని బట్టి కలియుగాబ్దాలు, శాలివాహన చక్రవర్తి కాలాన్ని బట్టి శాలివాహన శకం, శంకరాచార్య శకం ఇలా రకరకాలుగా గణనం లోక వ్యవహారంలో ఉన్నది. (పాశ్చాత్యులు క్రీస్తుజీవిత కాలం ప్రాతిపదికగా, సంవత్సరాలు గణిస్తున్నారు.
- ==============================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...