సూర్యుడు ఒకరాశి నుండి మరొక రాశికి చేరడాన్ని సంక్రాంతి అంటారు . జ్యోతిష్య శాస్త్రం ప్రకారము సంవత్సరములో 12 సార్లు సంభవిస్తాయి (వస్తాయి). ఈ పన్నెండే కాకుండా సంక్రమణ సమయంలో వచ్చే వారాల్ని , నక్షత్రాలను బట్టి మరో ఏడు సంక్రాంతులున్నాయి .
రాశులు : 12.=1.మేషము 2.వృషభము 3.మిధునము 4.కర్కాటకము 5.సింహము 6.కన్య 7.తుల 8.వృశ్చికము 9.ధనుస్సు 10.మకరము 11.కుంభము 12.మీనము .
ఏడాదిలో వచ్చే 12 సంక్రాంతులను నాలుగు భాగాలుగా విభజించవచ్చును . అవి ->
1. అయన సంక్రాంతులు , 2. విఘవ సంక్రాంతులు , 3. షడశీతి సంక్రాంతులు , 4. విష్ణుపదీ సంక్రాంతులు .
1.ఉత్తరాయణ ఆరంభంలో వచ్చే "మకర సంక్రాంతి" , దక్షిణాయణం ఆరంభం లో వచ్చే "కర్కట సంక్రాంతి " రెండింటినీ అయన సంక్రాంతులు అంటారు .
2.మేష, తులా సంక్రాంతులు విఘవ సంక్రంతులు -- అంటే ఈ కాలమ్లో రాత్రింబవళ్ళు సమానం గా ఉంటాయి కాబట్టి వాటికాపేరు వచ్చింది .
3.మెధున , కన్యా , ధనుర్మాస సంక్రాంతులు ను షడశీతి సంక్రాంతులంటారు .
4.వృషభ , సింహ , వృశ్చిక , కుంభ సంక్రాంతులను విష్నుపదీ సంక్రాంతులంటారు .
మిగతా ఏడు -- మందా , మందాకిని , ధ్వాంక్షి , హోరా, మహోదరి , రాక్షసి , విశ్రితా సంక్రాంతులుగా జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది .
మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు . సూర్యుడు భూమధ్యరేకకు ఉత్తరదిశలొ ఉన్నట్లు కనిపించునప్పుడు --ఉత్తరాయణం అని , సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా సంచరించునట్లు కనిపించినప్పుడు -- దక్షిణాయణము అని పిలిచారు . (సంవస్తరాన్ని రెండు ఆయణములు గా విభజించారు) . ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే 6 నెలలు దక్షిణాయణం . ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతిసంవత్సరము జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయణం అని , జనవరి 15 నుండి జూలై 15 వరకు దక్షిణాయణం అని అంటారు . ఇంతటి మార్పుకు సంబంధించిన రహస్యాన్ని లోకం లోని అతిసామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు .సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణము లో ప్రవేశించు గడియలనే పుణ్యకాలం అంటారు .మన జ్యోతిష్య్ శాస్త్రం ప్రకారము దక్షిణాయణం లో దేవతలు నిద్రించి ఉత్తరాయణమ్లో మేల్కొంటారని పురాణాలు తెలియజేయుచు్న్నాయి. మానవులు సంత్సరకాలము దేవతలకు ఒకరోజుగాను ... దక్షిణాయణం రాత్రి , ఉత్తరాయణం పగలు గా మన ఆద్యాత్మిక శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఉత్తరాయణం లో స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయని , ఈ కాలలములో మరణించినవారికి వైంకుఠ ప్రాప్తి కలుగుతుందని బ్రహ్మ సూత్రాలు చెబుతున్నాయి . ఈ మకర సంక్రమణము పుష్య మాసం నుండి వస్తుంది. దక్షిణాయణము లో చనిపోయిన మన ఆత్మీయులు మనమిచ్చే తర్పణాలు మూలముగా ఉత్తరాయణ ప్రారంభం కాగానే తెరి్చియున్న ద్వారాలు గుండా వైకుంఠం చేరుకుంటారని (వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ) నమ్మకం . అందుకే పెద్దలకు పూజలు , కొత్తబట్టలు , నైవేద్యాలు పెడతారు ... పూజలు జరుపుతారు . అంతా నమ్మకమే. . . ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు .
- ======================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...