Thursday, January 27, 2011

గృహప్రవేశము చేసేటపుడు పాలు పొంగించడం ఎందుకు ?, Milk boiling at new house opening is why?


గతం లో కట్టెల పొయ్యి మీద వంటచేసేవారు . శుభ పర్వదినాల్లో రెండు బియ్యపు గింజలను పొయ్యిలో వేసేవారు . . అలా మాడిన బియ్యపు వాసనవల్ల వంటగదిలో అనేక క్రిమికీటకాలు దూరంగా తొలకిపోతాయి. కాలం మారుతుండడంతో బ్రతుకుతెరువు కోసం అనేక చోట్లకు జనం తరలి వెళ్తుండడం తో వెళ్ళినచోట పాటు పొంగంచి బియ్యం వేసి ఉడికించిన పొంగలిని నైవేద్యము గా భగవంతునికి సమర్పించమని పెద్దలు ఆచారము గా ఈ నియమాన్ని పెట్టేరు .

పాలు పొంగి దొర్లేటట్లు చూసారు . . . అంటే ఆ గృహము లో ప్రవేసించిన నాటినుండి తమ జీవితాలలో సుఖసంతోషాలు పాల పొంగులా ఎల్లాప్పుడు దొర్లుతూ ఉండాలి భావన . . నమ్మకం .

ఆదిపరాశక్తి ఈ చరాచర జగత్తును సృష్టించే సంకల్పంతో బ్రహ్మకు సృష్టి కార్యాన్ని, విష్ణువుకు స్థితికార్యాన్ని, శివునికి లయకార్యాన్ని అప్పగించినది. సకల జీవకోటిలో ఉత్క్రుష్టమైన జన్మ మానవజన్మ. అటువంటి మానవులకు మేధస్సును, తేజస్సును, ఓజస్సును పుష్ఠిని, పరిపుష్ఠిని కలుగజేయునది గోమాత. మానవునకు జ్ఞాన, విజ్ఞానాలను కలుగజేయుటకు సాక్షాత్‌ ఆదిపరాశక్తి గోరూపాన్ని దాల్చి దివి నుండి భువికి దిగివచ్చినది. అటుంటి గోమాతను సేవించుట కాదు, నిత్యం పూజించవలయును. ఏ పూజగాని, ఏ యజ్ఞంగాని, ఏ యాగంగాని, ఏ దేవతా ప్రతిష్టగానీ, గోపూజ లేనిదే సిద్ధించదు. గృహ్రవేశ సమయంలో ముందుగా గృహమందు ప్రవేశించునది గోమాతే! దేవతామూర్తుల చిత్రపటాలను, విగ్రహాలను ఏ విధంగా అయితే గృహమందు శాశ్వతంగా ఉంచి పూజిస్తామో, అదే విధంగా గృహంలో ఉండే సకల దోషాలు, వాస్తు దోషాలూ తన పాద స్పర్శతో పోగొట్టే గోమాతకు కూడా గృహంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలి. గోమాత , గోపాలు , ఆవుపేడ , ఆవు మూత్రము అన్నీ పవిత్రమైనవని పూర్వీకుల నమ్మకం . మానవులకు అన్నివధాల ఉపయోగపడే ఆవును ఆద్యాత్మికం గా అలా పూజించి ఆదరించి ... అంతరించిపోకుండా చూడాలనేదే మన పురోహితుల ఉద్దేశము అని అనుకోవాలి .

  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...