మనం సహజంగా స్నానము చేసేది ఉదయం . ప్రతి ఒక్కరు చేసేదే ఇది. . కొంతమంది సాయంత్రం తమ పనులనుండి తిరిగి వచ్చాక స్నానం చేస్తారు . శరీరం పై ఉన్న మురికిని , మలినాలను శుభ్రచేసుకునేందుకే స్నానము . మరికొంతమంది నిద్రకోసం వేడినీరు రాత్రి పడుకునేమందు స్నానం చేస్తారు . ఇది రోజూ జరిగే పక్రియ .
ఎవరైనా చనిపోయిన వార్త విన్నప్పుడు , శ్మశానమునకు వెళ్ళి వచ్చాకా తప్పక స్నానము చేస్తుంటారు . ఇక్కడ బయటికి వెళ్ళిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి కి ఏధైనా అంటువ్యాధితో చనిపోతే ఆ ఇన్‌ఫెక్షన్ అంటుకోకుండా, వేసుకున్న బట్టలతో సహా తడిపి స్నానము చేస్తారు . పూర్వము ఏ మనిషి ఏ జబ్బుతో చనిపోయారో తెలిసేది కాదు .. అంతగా అభివృద్ధి చెందని , వైద్యవిజ్ఞానము అందని రోజులలో మన పురాణ రచయితలు ఈ నియమము పెట్టేరని భావించాలి .
అయితే దేవాలయం పవిత్రమైన ప్రదేశం . చుచి శుభ్రత అక్కడ పాటిస్తారు . అంటువ్యాధులు వచ్చే అవకాశము లేదు . పూర్వము అనాగరికులకు , పరిశుభ్రతలేనివారికి ఆలయ ప్రవేశము ఉండేదికాదు . అందుచే పవిత్రమైన ఆలయం నుండి తిరిగి వచ్చి స్నానము చేస్తే ఆ పవిత్రత , పుణ్యము పోతుందని నమ్మకం ...ఏ కారణంగానూ దేవాలయానికివెళ్ళి వచ్చి స్నానము చెయ్యకూడదు . నమ్మకం తో పుణ్యము వచ్చిందనేది మనదేహం నుండి తుడుచు పోతుందని మన మతాధికారు పెట్టిన నియమము .
పుణ్యము , పాపము ఒక మనిషి మనస్సుకు సంబంధిన విషయము . పాపము చేస్తే నరక లోకము లో శిక్షలు పొందుతావు ,, పుణ్యము చేస్తే స్వర్గము చేరుతావు అనేది ఎవరికి .... మనసు కా ? దేహానికా ? , చనిపోయాక దేహము మట్టిలో కలిసిపోతుంది కదా! కనుక చచ్చినవానికి దేహము తో సంభందము లేదు . స్వర్గమో , నరకమో అది ఆత్మకే చెందుతుంది . ఇప్పుడర్ధమైయిందికదా ఈ స్నానమనేది ఆరోగ్యము కాపాడేందుకేనని .
====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
Friday, January 28, 2011
Advised not to take bath after coming from Temple-why?,దేవాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చాక స్నానం చేయకూడదంటారు-ఎందుకు?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
your comment is important to improve this blog...