మనుషులు 'వ్యవసాయం' కనిపెట్టి సుమారు 12,000 సంవత్సరాలు అవుతుంది. అయితే మొదట్లో ఏ సముహం పండించే పంట కుటుంబానికీ సరిపోయేది గాని మిగులు అనేది ఉండేది కాదు. మొక్కలు ఏపుగా పెరిగేందుకు, మంచి పంటను ఇచ్చేందుకు ఏం చెయ్యాలో మానవుడు క్రమ క్రమంగా తెలుసుకొన్నాడు. గింజలను నాటాలంటే నేలలో ఏదో ఒక సాధనంతో గుంతలు తవ్వాలి ఇందుకై మొదట్లో ఒక వైపు కొనదేలి ఉన్న కట్టెలను గాని రాళ్ళనుగాని వాడెదరు. వీటితో గుంతలు తవ్వడం సాలు తీయ్యడం చేసేవారు. ఆ తరువాత దిశలో జింక కొమ్ము లు వంటి వాటిని లేదా వంకీ తిరిగి ఉన్న చెట్టు కొమ్మలను వాడుతూ ఈ పని చెయ్యడం మొదలుపెట్టారు.
మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి నాగళ్ళు ఇవే అని చెప్పాలి. ఈ తరవాతి దిశలో ఒక పొడవాటి కలపదుంగ కొనను వంపు తిరిగి కొనదేలి ఉన్న ఒక భాగంగా మార్చి ఆ నిర్మాణం సాయంతో పొలాలు దున్నడం మొదలుపెట్టారు. మరి కొంత కాలం తరువాత ఒక పొడవాటి కలపదుంగ కు విడిగా మరో భాగాన్ని కలిపి నాగలిని నిర్మించారు. ఇది అంతకు ముందు సాధనల కన్నా చాల చక్కగా పనిచేసింది. లోహాలను ఉపయోగించడం మొదలు పెట్టాక నాగలితో దున్నే వైపు వున్న భాగాలను లోహపు పట్టిలను అమర్చడం మొదలు పెట్టారు. ఇది నాగల సమర్థనను మరింత పెరిగింది.
మొదట్లో మనుష్యులే పొలాలలను దున్నప్పటికి క్రమంగా ఎడ్ల వంటి జంతువులతో దున్నించడం మొదలు పెట్టారు. ఇలా ఎడ్లతో పొలాలను దున్నించడం అనేది కీ.పు 3000 నాటికి అమల్లోకి వచ్చింది. అయితే నాగలివల్ల జంతువులతో పొలాలను దున్నించడం వల్ల గతంలో కన్నా వ్యవసాయం చాల సులభంగా మారి, ఎక్కువ మొత్తంలో పంట దిగుబడిని పొందడానికి వీలయింది. ఆహారం పుష్కలంగా లభించడం, బోలెడంత తీరిక దొరకడం అనే ఈ పరిస్థి మానవ నాగరికతలో భాషలు, కళలు, సంస్కృతి వంటి అనేక అంశాలు వికసించడానికి దారి తీసింది. ఆ దిశలోనే ట్రాక్టర్ ని కనిపెట్టడం జరిగింది .
- ====================================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...