Sunday, March 13, 2011

గృహము లో దేవతా విగ్రహాల ఎత్తు ఎంత ఉండ వచ్చును ?




ప్ర : గృహము లో దేవతా విగ్రహాల ఎత్తు ఉండ వచ్చును ?
జ : గృహము లో దేవతా విగ్రహం రెండు అంగుళాలు మించి ఉండకపోతే మంచిది . ఆ ఎత్తు దాటితే స్వామికి మనము చేసే పూజ తృప్తినివ్వదు . దానివల్ల అనవసర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని పురాణాలు చెపుతున్నాయి. ఇది ఒక నమ్మకమేనని నా అభిప్రాయము . అలాగే కుంకుమ పూజ చేసేటపుడు అమ్మవారు ముఖము మీద కుంకుమ పడేలా పూజ చేయకూడదు.
  • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, March 12, 2011

పతియే దైవమని తెలిసినా భర్త ని కాదని గుడిలో దేవుని పూజిస్తారెందుకు?



ప్ర: అహర్ణిశలు తన కుటుంబ క్షేమము కోసం పాటు పడే భర్తని కాదని గుడులు , ఆశ్రమాల వెంట తిరిగే భార్యలనేమనాలి?
జ : ప్రత్యక్ష దైవము కంటే పరోక్ష దైవమే కాపాడు తాడనే బరోసా కలిగే వారని అనాలి . పొరిగింటి పుల్లకూర రుచి అనే సామెత నిజమని రుజువు చేసేవారు . ఆడది అహంకారము తో కూడికొని జన్మించినది . తన అంకెకు రాని మహాబలాడ్యు వేబంగులమాయలొడ్డి చెరుపన్‌ తలపెట్టు . అందుకె " అంగను నమ్మరాదు " అని ఒక మహాకవి అన్నాడు . భర్తను కాల్చుకుతినేవాళ్లు భర్త ఆయుర్ధాయం కోసం పూజలు చేస్తారు . ఈ ప్రవృత్తి మనకర్ధము కాదు .

  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, March 11, 2011

దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?,Which oil good to lit the Lamp at God




ప్ర : దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?,Which oil good to lit the Lamp at God

జ : దీపారాధనకు హైందవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యముంది. సకల సిరులను, సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి జ్యోతి స్వరూపిణి. ఏ శుభకార్యం ఆరంభించినా, ముందుగా దీపప్రజ్వలనం చేయడం మన ఆచారం. దీపం వెలిగించేముందు 'దీపం జ్యోతిపరబ్రహ్మ దీపం సర్వతమోపహరమ్‌' అన్న శ్లోకం పఠిస్తారు. పర్వదినాలు, పండగలు, శుభకార్యాలు, పుష్కరాలు, వ్రతాలు, ఉద్యాపనలు, సభలు, సమావేశాలు, ప్రవచనాలు, భజనలు, సత్సంగం- దీపసమర్పణకు అనుకూల సమయాలు. శివరాత్రి, పూర్ణిమ, సోమవారం, దీపావళి, కార్తీకమాసంలోని ముప్ఫై రోజులూ, జ్వాలాతోరణ దీపాలు అత్యంత ప్రశస్తమైనవి. దానాలన్నిటికన్న దీపదానం శ్రేష్ఠమైనదని పురాణ కథనం.

  • ఆవునెయ్యి ఉత్తమం.
  • మంచి(నువ్వుల ) నూనె మధ్యమము.
  • ఇప్ప నూనె అధమము.
  • వేరుశనగ నూనెతో దీపాన్ని దేవుని ముందు పెట్టరాదు.

ఆవు నెయ్యితో వెలి గించిన దీపం ఫలం అనంతము. అష్టైశ్వ ర్యాలూ, అష్టభోగాలు లభిస్తాయి. వెండి లేదా పంచలోహాలతోనూ, మట్టితో చేసిన ప్రమిదలు శ్రేష్టము. ఆముదంతో వెలిగించిన దాంతపత్యసుఖమూ, జీవిత సౌఖ్యమూ లభిస్తాయి.

శ్రీ మహాలక్ష్మికి ఆవునెయ్యి దీపమూ, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపమూ అన్నా ప్రీతి.



  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కొత్త బట్టలకు నలువైపులా పసుపు ఎందుకు రాస్తారు?,Why do corners of new clothes paste with Turmeric



ప్ర : కొత్త బట్టలకు నలువైపులా పసుపు ఎందుకు రాస్తారు?,Why do corners of new clothes paste with Turmeric?

జ : -ఈ ఆచారాన్ని మన పూర్వీకులు ఆరోగ్యం కోసం పెట్టారు. బట్టలను మగ్గాలపై నేస్తారు. నేసే ముందు నూలుకు పిండితో తయారయిన గంజి పెడతారు. అలా గంజి పెట్టి నేయటం వల్ల అనేక రోగక్రిములు వస్త్రాల్లో చేరతాయి. అలాంటి వస్త్రాలను ధరిస్తే చర్మ సంబంధిత రోగాలొస్తాయి. అందుకే క్రిములను దూరం చేసే పసుపును నలువైపులా రాసి ఆపై ధరించమని చెబుతారు. పసుపు మంగళకరానికి కూడా గుర్తు. అందానికి ప్రతీక . స్త్రీలకు పసుపు కుంకుమే అందము . కావున అందాన్ని ... ఆరోగ్యాన్ని ఇచ్చే పవుపు కొత్త బట్టలకు నాలుగు మూలలా రాస్తారు .


  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, March 10, 2011

గడ్డం-గత వైభవం ఏమిటి?, What was Beard importance in history?






--ప్రాచీన కాలపు బాబిలోన్‌లో గడ్డాలకు గొప్ప గౌరవం ఉండేది. నిజం చెప్పాలంటే అన్ని ప్రమాణాలూ గడ్డం సాక్షిగా జరిగేవి. మనిషి గడ్డాన్ని పట్టుకోవడం అన్నది క్రీ.పూ. 2వ సహస్రాబ్దిలో సన్నిహిత స్నేహానికి గుర్తుగా పరిగణించే వారు. గడ్డాన్ని పట్టుకొని లాగడం అన్నది మొరటైన పనిగా మాత్రం కాదు అతి అవమానకరమైన పనిగా గుర్తింపబడేది. కొంత మంది గడ్డాన్ని వివేకపు చిహ్నం గా పరిగణిస్తారు. ప్రాచీన కాలపు ఈజిప్టువారి సంఘంలో గడ్డం ఒక హోదాను సూచించేది. గడ్డం ఎంత పొడవుగా ఉంటే వారు అంత గొప్ప హోదాకలవారిగా గుర్తింపబడేవారు.

ఎక్కడ వారి గడ్డాలలో ఒకే ఒక వ్యత్యాసం ఉండేది. క్రీ.పూ. 3000 సంవత్సరాల క్రితం ఉన్న ఈజిప్టువారు కృత్రిమ గడ్డాలను ధరించేవారు. అలెగ్జాండర్‌ (క్రీ.పూ.356-323) తన సైనికులకు గడ్డం పెంచేందుకు అనుమతి ఇవ్వలేదు. గడ్డాలు కొంతమంది ముఖానికి అందాన్ని చేకూరుస్తున్నాయి. అప్పుడప్పుడు గడ్డాలు మనిషి ముఖంపై ఉన్న మచ్చలనూ, దెబ్బల గుర్తును కప్పిపుచ్చుకునేందుకు కూడా ఉపయోగపడుతాయి. తన ముఖంపై ఉన్న గాయపు మచ్చలను కప్పిపుచ్చుకోడానికి రోమన్‌ చక్రవర్తి హాడ్రియన్‌ (క్రీ.శ.117-138) గడ్డాన్ని పెంచాడు. అది ఒక ఫ్యాషన్‌గా తయారయ్యింది. గడ్డాలను పెంచుకోవడం అన్నది 400 సంవత్సరాల తరువాత తిరిగి ప్రారంభమయ్యింది. దీనికి ముందు ఉత్తమ తరగతి రోమన్లు తమ బానిసలకు శుభ్రంగా క్షవరం చేయించేవారు. ప్రాచీన కాలపు గ్రీకులలో మగవారు గడ్డాలు క్షవరం చేయించుకోవడానికి మంగలి షాపులకు వెళ్లేవారు. ఇలా క్షవరం చేయించుకోవడం వల్ల మంగలి వారి ఆదాయం విపరీతంగా పెరిగిపోయింది.

ప్రాచీన కాలపు గ్రీకులలో మొదటిసారి పెరిగిన గడ్డాన్ని ఆనవాయితీ ప్రకారం అపోలో దేవతకు సమర్పించుకునేవారు. అపోలో దేవుడు సూర్యరశ్మి, సంగీతం, కవిత్వానికి సంబంధించిన దేవుడిగా ఉండేవాడు. రోమ్‌లో కూడా ఇలాంటి ఆనవాయితీ ఉండేది. ప్రాచీన కాలంలో ప్రజలు వెంట్రుకలను జీవితంగా, జీవితపు శక్తిగా పరిగణించారు. 6వ ఎడ్వర్డ్‌ చక్రవర్తి (1547-1553) కాలంలో ఇంగ్లాండులోని సామాన్యులకు గడ్డం పెంచుకునే అధికారం ఉండేదికాదు. వారు 3 వారాల గడ్డాన్ని మాత్రం కలిగి ఉండవచ్చు. అంతకు మించి కాదు. కొంతమంది రాజులు పెంచిన గడ్డాలపై సుంకం విధించి తద్వారా దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచేందుకు కష్టపడ్డారు.

-1558లో మొదటి క్వీన్‌ ఎలి జబెత్‌ గడ్డాలపై సుంకాన్ని విధించింది. ఇది చాలా అప్రతిష్టపాలు కావడంతో ఆపై సంవత్సరం ఇది వాపసు తీసుకోబడింది. మొదటి ఎలిజబెత్‌ రాణి చేసిన నేరాన్నే రష్యా దేశపు చక్రవర్తి పీటర్‌ చేశాడు. 1968లో గడ్డం పెంచుకున్న వారిపై 100 రూబుల్స్‌ పన్ను విధించాడు. ఆ రోజుల్లో గడ్డం పెంచుకునేందుకు లైసెన్స్‌ పొందవలసి వుండేది. ఒక రాతి తట్ట రూపంలో సుంకం కట్టాల్సి వచ్చింది. లైసెన్స్‌ను పొందకుండా గడ్డం పెంచడం అన్నది ఒక నేరంగా ఒక అపరాధంగా పరిగణించబడేది. మొగలాయి చక్రవర్తులలో చక్రవర్తి అయిన ఔరంగజేబు (1618-1707)కు గడ్డాల వెర్రి కాస్త ఉండేది. గడ్డం అన్నది నిజంగానే వివేకానికి చిహ్నం అని రష్యా దేశపు చక్రవర్తి పీటర్‌ ది గ్రేట్‌ (1682- 1725) భావించాడు. గడ్డం నున్నగా గీయించుకున్న రాజదూత తన పరి చయ పత్రాన్ని సమర్పించడానికి వస్తే దాన్ని స్వీకరించడానికి రష్యా దేశపు పీటర్‌ నిరాక రించాడు. గడ్డం పెంచడం ద్వారా అబ్రహాం లింకన్‌ ప్రత్యేకమైన సౌందర్యాన్ని పొందాడు.
  • ====================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

దానము అంటే ఏమిటి?, What is Donation?




దయతో ఇచ్చేది దానము. దీన్ని ఇంగ్లిష్ లో డొనేషన్‌ అంటాము. దానము అనేది అవతలి వారు అడినది ... వారికి ఉపయోగపడేది ఇచ్చే వస్తువు . మనకి పనికిరాని పుస్తకాలు , దుస్తులు , మెడిసిన్స్ , ఆహారపదార్దాలు డొనేట్ చేస్తూ ఉంటాము . మన ఆత్యాద్మిక శాస్తాలలో చెప్పిన దానము వేరు ...నీకు పనికి రానిది ఇవ్వవడం దానము కాదు . అవతలవ్యక్తికి పనికివచ్చే వస్తువునే దానము చేయాలి . . , అదే నిజమైన దానము ఫలితముంటుంది . దానము అందుకునే వారు దీవించే దీవెనలే గృహస్తులకు మేలుచేస్తాయి. దానము చే్స్తే పుణ్యము వస్తుందంటారు . అసలు పుణ్యమంటే ఏమిటి? . ఈ విశ్వములో 80 లక్షల రకాల జీవులు ఉన్నాయని అంచనా .
పుణ్యము : ఇతత జీవులకు కస్ట , ఇస్ట , నస్టము కానివి ఏదైనా ... కస్టము కలిగించని , ఇస్టమైనది , నస్టము కానిది చేసే కార్యాలే (పనులే)పుణ్యము. నస్టమైనవి , ఇస్టము లేనివి , కస్టము కలిగించేవి .. పాపము .(పాపకార్యాలు )


దానాని సంబంధిత పదాలు

1. వస్త్రదానము.
2. అన్నదానము.
3. భూదానము.
4. విద్యాదానము.
5. గుప్తదానము.
6. కన్యాదానము.
7.సాలగ్రామ దానము .
8.హిరణ్య దానము

దశవిధ దానములు :- 1.స్వర్ణ దానము, 2.రజిత దానము, 3.గో దానము, 4.అన్న దానము, 5.వస్త్ర దానము, 6.విద్యాదానము.7.రక్త దానము ,8.భూ దానము ,9.గుప్త దానము ,10.కన్యా దానము ,

  • ===============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, March 08, 2011

ద్వైతం అద్వైతం విశిస్టాద్వైతం అంటే ఏమిటి?,Waht are Dwaitham- Adwaitam- VisTaAdwitam ?



ద్వైతం : నీవు దైవం ; నేను జీవున్ని ..... నీవు గురువు , నేను శిష్యుణ్ణీ అన్నది ద్వైతం .
మధ్వాచార్యులు ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది.

సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ.... కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.
  • ---------------------------------------------------------------------
అద్వైతం : నీవు -నేను ఒక్కటే అన్నది అద్వైతం .



అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది, జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. శంకరుడు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం.


చారిత్రకంగా దీని ప్రతిపాదకుడు గౌడపాదాచార్యుడు. ఇతడు శంకరుని గురువైన గోవింద భగవత్పాదునకు గురువు. అయితే మనకు లభించిన సాహిత్యం ప్రకారం ఈ తత్వానికి మూలగ్రంధాలు ప్రస్థానాత్రయం (Prasthanatrayi) — అనగా ఉపనిషత్తులు, భగవద్గీత మరియు బ్రహ్మసూత్రాలకు శంకరుడు రచించిన భాష్యాలు.
  • -----------------------------------------------------------------------------------------------
విశిష్టాద్వైతం : నీవు(దేవుడు) -నేను(జీవి) -ప్రకృతి(పంచభూతాలు) అన్నవి వేర్వేరు అయినా ఒకదానిలో ఒకటి మిలితమై అంతటా వ్యాపించి ఉంటాయి .
విశిష్టాద్వైతం అనేది 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత దర్శనము.


జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. 'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.


  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, March 07, 2011

Telugu old writers and their books, ప్రాచీన తెలుగు కవులు వారి గ్రంధాలు పేర్లు ఏమిటి?



  1. వేములవాడ భీమకవి -- కవిజనాశ్రయం ,
  2. మారన --మార్కండేయ పురాణము ,భాష్కర శతకం .
  3. కేతన ---దశకుమార చరిత్ర ,
  4. మంచన --- కేయూరబాహు చరిత్ర ,
  5. బద్దెన --- సుమతీ శతకం ,
  6. నాచన సోమన --- ఉత్తర హరివంశం ,
  7. జక్కన --- విక్రమార్క చరిత్ర ,
  8. అనంతామాత్యుడు --- భోజరాకీయము , అనంతుని చందము ;
  9. దగ్గుపల్లి దుగ్గన --- నాసికేతోపాఖ్యానం ;
  10. పిల్లలమర్రి పినవీరభద్రుడు --- శృంగార శాకుతలం , జెమినీ భారతం ;
  11. దూబగుంట నారాయణకవి ---పంచతంత్రము ,;
  12. కొరవి గోపరాజు --సింహాసనా ద్వాత్రింశిక ,;
  13. తిరుపతి వెంకట కవులు -- పాండవోగ్యోగ విజయములు , దేవీ భాగవతం ;
  14. నంది మల్లయ, ఘంటసింగన(జంటకవులు) ప్రబోధ చంద్రోదయం , వరాహ పురాణం ;
  15. చేమకూర వేంకటకవి -- విజ విలాసం .;
  16. సువవరం ప్రతాపరెడ్డి --- ఆంధ్రుల సాంఘిక చరిత్ర ;
  17. చిలకమర్తి లక్ష్మీనరసింగం --- గయోపాఖ్యానం ;
  18. రాజశేఖర శతావధాని -- రాణాప్రతాప్ సింహ చరిత్ర , ;
  19. తుమ్మల సీత్రారమమూర్తి చౌదరి -- రాస్ట్రగానం , బాపూజీ ఆత్మకధ ;
  20. ఆరుద్ర -- సమగ్ర ఆంధ్ర సాహిత్యం ;
  21. గడియారం వేందట శేషశాస్త్రి --- శివబారతం ,;
  22. దాశరధి --- తిమిరంతో సమరం ;
  23. శ్రీపాద కృష్ణమూర్తి -- బొబ్బిలియుద్ధం , రామాయణ భారత భాగవతాలు ;
  24. దువ్వూరి రామిరెడ్డి --- పానశాల ,
  25. ఏనుగు లక్ష్మణ కవి --- భర్తృహరి సుభాషితాలు ,
  26. కంచర్ల గోపన్న ----దాశరధీ శతకం ,
  27. వేమన ---- వేమన పద్యాలు ,
  28. నృసింహ కవి ----కృష్ణ శతకం , .
  29. శేషప్ప కవి ---- నృసింహ శతకం .
  30. అన్నమయ్య --- శ్రీ వెంకటేశుని కీర్తనలు .
  31. త్యాగయ్య ----- త్యాగరాజ కీరతనలు .

  • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, March 04, 2011

రాత్రులు హాయిగా నిద్ర పోవడం ఎలా?, How to get good sleep at night?


ప్ర :
రాత్రి హాయిగా నిద్ర పోవాలంటే ఏమి చేయాలి?.

జ : నిద్ర లేదా నిదుర (Sleep) ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు మరియు చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్ధ్యం తగ్గినట్లుగా గుర్తించారు. అయితే నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. గాలి ,నీరు , ఆహారము లాగే నిద్ర కూడా ఒక సహజ శారీరక అవసరము . ఎవరెన్ని గంటలు నిద్రపోవాలన్న అంశం పైన భిన్నాబిప్రాయాలు ఉన్నా వేళకు తిని , వేళకు పడుకుంటే ఆరోగ్యాము నిక్షిప్తం గా ఉంటుంది . అలసిన మనసుకు , తనువుకు నిద్ర ఒక వరము .

మంచి నిద్ర రావడానికి ఈ క్రింది చూచనలు పాటించాలి :
  • * రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఆల్కహాలు తీసుకోడదు . ఆల్కహాలు మధ్యలో నిద్రను చెడగొడుతుంది .
  • * రాత్రి 7 గంటలు తరువాత తీ , కాఫీ , కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు ,
  • * రాత్రి ఆలస్యము (చాలా పొద్దుపోయిన తర్వాత) గా ఆహారం తినకూడదు.
  • * రాత్రులు ఎక్కువగా ఆహారము (full meal) తినకూడదు ,డిన్నర్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
  • * పడుకునే ముందు వ్యాయామము చేయకూడదు ,
  • * పడక గదిని ... పనిచేసే ఆఫీస్ గది గా మార్చకూడదు ,
  • * పడుకునే ముందు వేడిపాలు తాగితే మంచి నిద్ర వస్తుంది .
  • పదుకునే సమయానికి గంట ముందు టెలివిజన్‌ ఆపెయ్యాలి -టి.వి , కంప్యూటర్ లో వచ్చే వెలుగు , రంగులు కళ్ళను , మెదడును ఇబ్బంది పెడతాయి , మెదడు ఉత్తేజ పడడం , ఎడ్రినల్ హార్మోను ఉప్ప్తత్తి దీనికి కారణము ,
  • * నిద్ర రానపుడు ఏదైనా మంచి పుస్తమును చదవాలి - సెక్ష్ నవలలు , డిటెక్తివ్ పుస్తకాలు చదువరాదు .. ఇవి మెదడును ఉత్తేజపరచి ఎడ్రినాలిన్‌ , నార్ ఎడ్రినాలిన్‌ ఉప్పత్తి అయి నిద్ర రానివ్వవు ,
  • * నిద్రపోయేముందు వేడినీళ్ళ స్నానము చేస్తే మంచి నిద్ర పడుతుంది ,
  • * సుఖ నిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు తోడ్పడతాయి . మంచి ఆహారం, సుఖనిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.
  • * శరీరంలో షుగర్‌ సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌షుగర్‌ తక్కువగా ఉన్నట్లయితే నిద్రపట్టదు. కలత నిద్ర కలుగుతుంది.
  • * ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.
  • * పడక చేరబోయేముందు ఎక్కువ నీరు తాగకూడదు.
  • * మూత్ర విసర్జన చేసి పడకచేరాలి.

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

దగ్గు ఎందుకు వస్తుంది ? , Why do we get cough?


  • Cough Syrup - Coughing
  • దగ్గు మందు ------------------------------దగ్గు .

ప్ర : ప్రతి ఒక్కరూ ఎదో ఒక సందర్భములో దగ్గుతారు ఎందుకు?
జ : పలు సందర్భాలలో దగ్గుతో భాద పడడం మన అందరికీ అనుభవమే. దీనికి కారణము గొంతులో గాని , వాయునాళములో గాని చేరిన సూక్ష్మక్రిములు , సూక్ష్మపదార్ధములు , కఫమును బయటకు పంపేందుకు శరీరం చేసే ప్రయత్నమే దగ్గు . దగ్గినపుడు ఊపిరితిత్తుల్లోని గాలి వేగంగా బయటకు వస్తుంది . దీని వల్ల ఏర్పడే ఒత్తిడి గొంతు , శ్వాసనాళాల్లోని పదార్ధములను బయటకు పంపుతుంది . కావున శ్వాసనాళాల్లోని , ఊపిరిత్తులల్లోని కఫాన్ని క్లియర్ చేసేందుకే దగ్గు వస్తుంది .
మన డయాప్రమ్‌ బలముగా సంకోచము (Diaphrgm ) చెందడము , ప్రక్కటెముకలు మధ్యఉన్న కండరాలు(inter costal muscles) ఒక్కసారిగా సంకోచము అవడం మూలాన ఈ పక్రియ జరుగుతూ ఉంటుంది .

  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.